దారుణం: పెట్రోల్ పోసి.. బండతో కొట్టి తమ్ముడిని హత్య చేసిన అన్న
వరంగల్‌లోని ఉర్సు కరీమాబాద్‌లో శ్రీకాంత్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.
దిశ, వరంగల్ బ్యూరో : వరంగల్‌లోని ఉర్సు కరీమాబాద్‌లో శ్రీకాంత్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. శ్రీకాంత్‌ను అన్న శ్రీధర్ ఇంటికి పిలిచి ఒంటిపై పెట్రోల్ పోసి ఆ తర్వాత బండ రాయితో కొట్టి చంపినట్లుగా మృతుడి భార్య విలపిస్తూ వెల్లడించింది. ఈ ఘటన శనివారం రాత్రి కరీమాబాద్‌లో జరిగింది. అన్నదమ్ముల మధ్య కొన్నేళ్లుగా భూ వివాదం నడుస్తోందని సమాచారం. గతంలోనూ శ్రీకాంత్‌పై శ్రీధర్ హత్యాయత్నానికి పాల్పడినట్లుగా మృతురాలి భార్య చెబుతోంది. ఈ సంఘటన సమాచారం అందుకున్న మిల్స్ కాలనీ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.