వరంగల్ పోలీస్ కమిషనర్‌కు డీసీపీల శుభాకాంక్షలు

Update: 2022-01-24 13:53 GMT

దిశ, హన్మకొండ టౌన్: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఐజీగా పదోన్నతి పొందిన వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి సోమవారం ఐజీ హోదాలో కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా సాయుధ పోలీసుల గౌరవాన్ని స్వీకరించిన పోలీస్ కమిషనర్ తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరిస్తూ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఐజీని వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన ఈస్ట్ డీసీపీ వెంకటలక్ష్మి, వెస్ట్ జోన్ డీసీపీ సీతారాం, లా అండ్ ఆర్డర్ అదనపు డీసీపీ సాయి చైతన్య, సెంట్రల్ జోన్ ఇంచార్జ్ డీసీపీ పుష్పారెడ్డి, పరిపాలన విభాగం అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్, ట్రైనీ ఐపీఎస్ పంకజ్, ఏఆర్ అదనపు డీసీపీలు భీంరావు, సంజీవ్‌తో పాటు ఏసీపీలు, ఇన్స్ స్పెక్టర్లు, ఆర్ఐలు, సబ్-ఇన్స్పెక్టర్లు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags:    

Similar News