భట్టి సాక్షిగా బయటపడ్డ స్టేషన్ ఘన్ పూర్ వర్గపోరు..
సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రానికి బుధవారం చేరుకుంది.
దిశ, వేలేరు,(ధర్మసాగర్): సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రానికి బుధవారం చేరుకుంది. ధర్మసాగర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతుండగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు బొల్లెపల్లి కృష్ణను వేదిక మీదకు పిలవాలని ఆయన వర్గీయులు నిరసన తెలుపుతుండగా కాంగ్రెస్ పార్టీ స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ ఇంచార్జి సింగపురం ఇందిరవర్గీయుల మధ్య తోపులాట జరిగింది.