Station Ghanpur MLA : రోడ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి

జనగామ పట్టణంలోని డ్రైనేజ్ వాటర్ నెల్లుట్ల చెరువు లో

Update: 2024-09-23 12:41 GMT

దిశ,లింగాల గణపురం : జనగామ పట్టణంలోని డ్రైనేజ్ వాటర్ నెల్లుట్ల చెరువు లో కలవడంతో నీరు కలుషితం అవుతుందని, నివారించడం కోసం త్వరలో పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం ఆయన మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఇటీవల మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడంతో పాటు, కల్వర్టుల నిర్మాణం పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నెల్లుట్ల చెరువు లో డ్రైనేజీ వాటర్ చేరడం వల్ల బురదతో నిండి కలుషితం అవడంతో పాటు, గోదావరి నీరు కూడా అందులో చేరడంతో రైతులు పంట సాగు కు కూడా కలుషిత నీరే వాడుతున్నారని దీంతో భూగర్భ జలాలు కలుషితం అయ్యే ప్రమాదం తన దృష్టికి తీసుకువచ్చారని,అందుకే జనగామ మున్సిపాలిటీ లో ఒక ఎస్టీపీ నీ మంజూరు చేయించి జనగామ పట్టణంలో డ్రైనేజ్ వాటర్ నెల్లుట్ల చెరువులో కలవకుండా చేపట్టే పనుల కోసం 2కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు.

త్వరలో డిజైన్ తయారు చేసి టెండర్లకు పిలిచి పనులు ప్రారంభిస్తామన్నారు. పటేల్ గూడెం వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జిని మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆర్ అండ్ బి అధికారులకు కాంట్రాక్టర్ సూచించారు. తాత్కాలికంగా చేపట్టిన డైవర్షన్ రోడ్డుపై నుంచి వాహనాలు వెళ్లే విధంగా పనులు పూర్తి చేయాలన్నారు. నెల్లుట్ల గ్రామంలో వరద దాటి కొట్టుకుపోయిన వ్యవసాయ బావులకు, స్మశాన వాటికకు వెళ్లే రోడ్లు వరద ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల తాత్కాలిక పనులు చేపట్టలేకపోతున్నామని అధికారులు, ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, నీటిపారుదల శాఖ అధికారంతో మాట్లాడి అశ్వారావు పల్లి, చిటకూడు రిజర్వాయర్ల నుంచి వచ్చే గోదావరి నీటిని నిలిపివేస్తామని, వారం రోజుల్లో పనులు పూర్తి చేసి ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలన్నారు, ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ మండల పార్టీ అధ్యక్షుడు కొల్లూరి శివకుమార్, మాజీ జడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, నాయకులు పో రెడ్డి మల్లారెడ్డి, కీసర దిలీప్ రెడ్డి,బిట్ల బాబు, దూసరి గణపతి, సదానందం, తాటిపాముల రమేష్, ఏలమూర్తి, సంపత్, అనిల్ గౌడ్, చిటుకుల వెంకటేష్, ఉపేందర్, నీల మోహన్, కృష్ణారెడ్డి, గోవర్ధన్, మార్కెట్ డైరెక్టర్ ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.


Similar News