రోడ్డు అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి : ములుగు కలెక్టర్

సోమవారం వెంకటపూర్ మండలంలోని రామప్ప దేవాలయ

Update: 2024-09-23 14:00 GMT

దిశ, ములుగు ప్రతినిధి: సోమవారం వెంకటపూర్ మండలంలోని రామప్ప దేవాలయ ఈస్ట్ రోడ్డు, గొల్లాల గుడిని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రామప్ప దేవాలయ ఈస్ట్ రోడ్డు అభివృద్ధి పనుల్లో వేగం పెంచి,ఏరియా మ్యాపింగ్ సర్వే చేసి, బౌండ్రి పిల్లర్ ఫిక్స్ చేయాలని, కెనాల్ కు సంబంధించిన ఏరియా సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అంతకుముందు కలెక్టర్ రామప్ప ఉపాలయాల్లో ఒక్కటైన గొల్లాల గుడిని సందర్శించి గుడి పైకప్పు, దెబ్బతిన్న శిఖరం, పైకప్పులో వికసించే తామర పువ్వు గుర్తుతో ఉన్న ,పూర్తిగా ధ్వంసం అయిన శిల్పం ను పరిశీలించారు. దేవాలయం పూర్తి వివరాలు పురావస్తు శాఖ అధికారులు కలెక్టర్ కు వివరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేవాలయములో ధ్వంసమైన శిల్పం, పువ్వు అన్ని డాక్యుమెంట్లు చేయాలని, రాత్రి కాపలదారుని ఏర్పాటు చేయాలని పురావస్తు శాఖ అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పురావస్తు శాఖ అధికారి మల్లేశం, ఇర్రిగేషన్ డి ఈ రవీందర్, తహసీల్దార్ సదానందం, ఎంపీడిఓ రాజు, ఆర్ ఐ, పంచాయతీ కార్యదర్శి, తదితరులు పాల్గొన్నారు.


Similar News