'ప్రతి ఒక్కరూ కంటి వెలుగుకు వెళ్లాల్సిందే... లేదంటే ఆరోగ్యశ్రీ కట్'
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వెళ్లి కంటి పరీక్షలు....Special News of Viral and Fake News Over Kanti velugu
దిశ, నెల్లికుదురు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వెళ్లి కంటి పరీక్షలు చేయించుకోకపోతే ఆరోగ్యశ్రీ కార్డు కట్ అని సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఇటువంటి వార్తల పట్ల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఎటువంటి కంటి సమస్యలు లేకున్నా బార్లు తీరిన వరుసలో నిలబడి తమ సమయాన్ని వృథా చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ సంబంధిత కార్యక్రమానికి హాజరై కంటి పరీక్షలు చేసుకొనట్లయితే తమ ఆరోగ్యశ్రీ కార్డు పోతుందో ఏమో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత విషయంపై స్థానిక పీ హెచ్ సీ అధికారి కారుపోతుల వెంకటేశ్వర్లు గౌడ్ ను దిశ వివరణ కోరగా.... కంటి వెలుగుకు హాజరైతేనే ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని ప్రభుత్వం నుంచి తమకు సమాచారం ఏమీ లేదన్నారు.