దిశ ఎఫెక్ట్.. ఎట్టకేలకు స్పందించిన ప్రభుత్వం

మహబూబాబాద్ జిల్లాలో నామినేటెడ్ పదవుల భర్తీలో భాగంగా వ్యవసాయ మార్కెట్ కమిటీలను.... Special News

Update: 2023-03-24 08:48 GMT

దిశ, మహబూబాబాద్ ప్రతినిధి: మహబూబాబాద్ జిల్లాలో నామినేటెడ్ పదవుల భర్తీలో భాగంగా వ్యవసాయ మార్కెట్ కమిటీలను కూడా భర్తీ చేసేందుకు జిల్లా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు కమిటీల పేర్లను ప్రభుత్వంకు పంపించారు. ఈ విషయంపై మార్కెటింగ్ శాఖ సైతం వారి విధానాలలో విచారణ అనంతరం నివేదికను శాఖ కమిషనర్ కు పంపించారు. ప్రాసెస్ పూర్తి అయినప్పటికీ నెలలు గడుస్తున్నా ఆయా మార్కెట్ కమిటీల ప్యానల్ ను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. దీంతో ప్యానల్ లిస్ట్ లో ఉన్నవారిలో ఉత్కంఠ నెలకొంది. లిస్ట్ ఫైనలేనా..అనే అనుమానంతో ఉన్నారు. నెలలు గడుస్తున్నా ప్రభుత్వం జిల్లాలోని కేసముద్రం, మహబూబాబాద్ మార్కెట్ పాలకవర్గంను ప్రకటించకపోవడంతో ఈ నెల 14న పాలకవర్గం ఫైనలేనా.. అనే శీర్షికతో దిశ దిన పత్రిక జిల్లా టాబ్లెయిడ్ లో వార్త ప్రచురితం కాగా, ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది.

మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఈ నెల 15న, కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఈ నెల 24న ప్రభుత్వం ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో మూడు వ్యవసాయ మార్కెట్ లు ఉన్నాయి. వీటిలో తొర్రూర్ పాలక వర్గం పదవి కాలం ఇంకా ఉండగా, మహబూబాబాద్, కేసముద్రం మార్కెట్ ల పాలకవర్గం ఖాళీగా ఉన్నాయి. ఎట్టకేలకు ప్రభుత్వం ఈ రెండు మార్కెట్ కమీటీలను ప్రకటించడంతో జిల్లాలో అన్ని మార్కెట్ కమిటీలకు సంబంధించిన పదవులు భర్తీ అయ్యాయి. కేసముద్రం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ నీలం సుహాసిని, వైస్ చైర్మన్ రవి, మహబూబాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ విద్యాసాగర్, వైస్ చైర్మన్ గుండా రాజశేఖర్ లను ప్రభుత్వం ప్రకటించింది. కాగా ఒకే ప్రభుత్వంలో ఒక టర్మ్ లో రెండు పాలక కమిటీల ప్రకటన ఇదే తొలిసారి కావడం విశేషం.

Tags:    

Similar News