ఖానాపూర్‌లో వింత..! పోద్దాటి చెట్టుకు ముంజగెలలు (వీడియో)
పోద్దాటి తాటి చెట్టుకు ముంజకాయలు కాసిన సంఘటన వరంగల్ జిల్లా ఖానాపూర్...Special News
దిశ, ఖానాపూర్: పోద్దాటి తాటి చెట్టుకు ముంజకాయలు కాసిన సంఘటన వరంగల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే... ఖానాపూర్ మండల కేంద్రానికి చెందిన పుల్లూరి ఎల్లగౌడ్ కల్లుగీత కార్మికుడు. అతనికి చెందిన మగ తాటిచెట్టు(పోతు తాడు) వింతగా ముంజకాయ గెలలు వేసింది. సాధారణంగా తాటి చెట్లలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి పోద్దాడు(పోతుతాడు), మరొకటి పరుపుతాడు(ఆడ తాటి చెట్టు). ఈ క్రమంలో భిన్నంగా పోతుతాడు గెలలు వేయడం గౌడ కులస్తులను, గ్రామస్తులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వింతను గ్రామస్తులు ఆసక్తిగా చూస్తున్నారు.