ఇన్‌ఫార్మర్ నెపంతో ఇద్దరి హత్య.. మావోయిస్టులుకు వ్యతిరేకంగా ఆదివాసీల భారీ ర్యాలీ

మావోయిస్టుల దుశ్చర్యను నిరసిస్తూ శనివారం ఉదయం ఆదివాసీలు, ఆదివాసీ సంఘాల నాయకులు ఏటూరు నాగారం మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నాకు కూర్చున్నారు.

Update: 2024-11-23 06:56 GMT

దిశ, ఏటూరు నాగారం: మావోయిస్టుల దుశ్చర్యను నిరసిస్తూ శనివారం ఉదయం ఆదివాసీలు, ఆదివాసీ సంఘాల నాయకులు ఏటూరు నాగారం మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నాకు కూర్చున్నారు. శుక్రవారం వాజేడు మండల మండల పరిధిలోని పెనుగోలు గ్రామానికి చెందిన ఇద్దరు ఆదివాసీలు ఉయిక రమేష్, ఉయిక అర్జున్‌ను మావోయిస్టులు ఇన్‌ఫార్మర్ నెపంతో హతమార్చారు. దీంతో దుశ్చర్యను వ్యతిరేకిస్తూ ఏటూరు నాగారం వై జంక్షన్ నుంచి బస్టాండ్ వరకు మావోయిస్టులు డౌన్ డౌన్, మావోయిస్టు పోరాటం అంటే ఆదివాసీలను చంపటమేనా అంటూ నినాదాలు చేస్తూ 3 వేల మంది ఆదివాసీలు భారీ ర్యాలీ నిర్వహించారు. 


Similar News