పెండింగ్ బిల్లులు చెల్లించలేదని బడికి తాళం

Update: 2024-09-26 13:00 GMT

దిశ, నెల్లికుదురు : జడ్పీహెచ్ఎస్ తో పాటు ప్రాథమిక పాఠశాలలో చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదని పాఠశాలకు తాళం వేసిన ఘటన నెల్లికుదురు మండలంలోని మేచరాజుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పాఠశాలల్లో చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదని ఎస్ఎంసి మాజీ చైర్మన్ బాధావత దినేష్ కోటగిరి కిరణ్ కుమార్ గౌడ్ లు గురువారం తాళం వేశారు.

దీంతో సంబంధిత పాఠశాలల బాలబాలికలు, ఉపాధ్యాయులు గేటు బయటే నిలబడి ఉండాల్సి వచ్చింది. ఈ సందర్భంగా దినేష్, కిరణ్ కుమార్ గౌడ్ లు మాట్లాడుతూ.. మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా.. అప్పులు చేసి మరీ పాఠశాలల్లో అన్ని నిర్మాణ పనులు పూర్తి చేశామని, రెండు సంవత్సరాలు దాటినా ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు చెల్లించకపోవడంతోనే.. విసిగిపోయిన తాను పాఠశాలకు తాళంవేసి నిరసన తెలుపుతున్నట్లు చెప్పారు దినేష్, కిరణ్ కుమార్ గౌడ్ లు.


Similar News