వ్యవసాయ మోటార్ల దొంగల ముఠా అరెస్ట్..

అంతర్ జిల్లా వ్యవసాయ మోటార్ల దొంగల ముఠాను డోర్నకల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

Update: 2024-11-22 13:04 GMT

దిశ, డోర్నకల్ : అంతర్ జిల్లా వ్యవసాయ మోటార్ల దొంగల ముఠాను డోర్నకల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. శుక్రవారం ఎస్పీ రామ్నాథ్ కేకన్ ఆదేశాల మేరకు మీడియా సమావేశంలో డీఎస్పీ తిరుపతిరావు వివరాలు వెల్లడించారు. ఈజీగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో 8 మంది ముఠాగా ఏర్పడి గత నాలుగు నెలలుగా ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో 24 వ్యవసాయ మోటార్లు దొంగిలించారు. విక్రయించి జల్సాలు చేశారు. నిందితులు విజయ్, వినేష్, మహేష్, జగన్, ఉపేందర్, భరత్ కుమార్ అరెస్ట్ చేయగా ఇద్దరు పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు. 18 మోటర్లు, ఒక ఆటో సీజ్ చేసినట్లు వెల్లడించారు. ప్రతిభ కనబరిచిన సిబ్బందిని అభినందించి, రివార్డు అందజేశారు. యువత చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట సీఐ రాజేష్, ఎస్సైలు వంశీధర్, గడ్డం ఉమ, సిబ్బంది తదితరులున్నారు.


Similar News