డిజిటల్ 'కీ' దుర్వినియోగం.. గ్రామ పంచాయతీ నిధులు స్వాహా

ఉప్ప సర్పంచ్ సంతకం ఫోర్జరీ చేసి పీఎఫ్ఎంఎస్ రూ. 1.76 లక్షల డబ్బులు డ్రా చేసిన ఓ.. వక్రబుద్ధి సర్పంచ్... నేను బాగా చదువుకున్న నా అంత ఎవరు చదువుకోలేదు.

Update: 2023-04-13 05:01 GMT

దిశ, పర్వతగిరి: ఉప్ప సర్పంచ్ సంతకం ఫోర్జరీ చేసి పీఎఫ్ఎంఎస్ రూ. 1.76 లక్షల డబ్బులు డ్రా చేసిన ఓ.. వక్రబుద్ధి సర్పంచ్... నేను బాగా చదువుకున్న నా అంత ఎవరు చదువుకోలేదు. అనే అహంకారంతో...మండలంలో సర్పంచులలో నేనే నంబర్ 1 అనే భ్రమలో బతికేవారిలో ఇతను ఒక్కరు. అతను గ్రామ ప్రథమ పౌరుడు.. ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ప్రజా నాయకుడు. అయితేనేం తన వక్ర బుద్ధిని ఉపయోగించి గ్రామపంచాయతీ ఖాతాలో జమ అయిన పీఎఫ్ఎంఎస్ రూ. 1.76 లక్షల నిధులు ఉపసర్పంచ్ సంతకాలు ఫోర్జరీ చేసి దర్జాగా డబ్బులు డ్రా చేసి వాడుకున్నాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని ఇస్లావత్ తండా పరిధిలో చోటు చేసుకుంది.

ఇస్లావత్ తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఇస్లావత్ రమేష్, ఉప సర్పంచ్ ఇస్లావత్ పీర్యా ఇద్దరికీ కలిపి చెక్ పవర్ ఉంది. కానీ సర్పంచ్ ఇస్లావత్ రమేష్ ప్రభుత్వం విడుదల చేసిన పీఎఫ్ఎంఎస్ ఖాతా 1.76 లక్షలు నిధులను ఉపసర్పంచ్ పీర్యాకు తెలియకుండానే ఫోర్జరీ సంతకాలతో దర్జాగా నిధులు డ్రా చేసి వాడుకున్నాడు. గతంలో కూడా మాజీ ఉప్ప సర్పంచ్ ఇస్లావత్ సావిత్రిని కూడా అదేవిధంగా ఒక్క బీఅర్ఎస్ నాయకుడు కలిసి ఆమెను కూడా సస్పెండ్ చేయించారు. గతంలో కూడా ఇస్లావత్ సర్పంచ్ ఇస్లావత్ రమేష్ పై చాలా ఆరోపణలు ఉన్నాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం నిధులు డ్రా చేయాల్సిన అవసరం ఉండి అధికారులు బ్యాంకు ఖాతాను తనిఖీ చేశారు.

తీరా చూస్తే ఖాతాలో నయాపైసా లేదు. అనుమానం వచ్చి అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారు విచారణ చేపట్టి గ్రామ పంచాయతీ నిధులు డ్రా చేసినట్లు గుర్తించారు. పూర్తి వివరాల సేకరణలో భాగంగా అసలు విషయం బయటపడింది. గ్రామ పంచాయతీకి వచ్చిన పీఎఫ్ఎంఎస్ నిధులను ఉపసర్పంచ్ పీర్యాకు తెలియకుండానే ఫోర్జరీ సంతకాలతో సర్పంచ్ ఇస్లావత్ రమేష్ నిధులు డ్రా చేసినట్లు గుర్తించారు. దీంతో ఉన్నతాధికారులు స్పందించి సర్పంచ్ రమేష్ పై చర్యలు తీసుకుంటారో ... వదిలేస్తారో తెలియాల్సి ఉంది. నేడు సర్పంచ్ ఇస్లావత్ రమేష్ పై ఉన్నతాధికారుల విచారణ...

ఫోర్జరీ చేసిన సర్పంచ్ పై తగిన చర్యలు తీసుకుంటాం

ఇస్లావత్ గ్రామ సర్పంచ్ ఇస్లావత్ రమేష్ ఉప్ప సర్పంచ్ పీర్యా సంతకాలు ఫోర్జరీ చేసి 1.76 గ్రామ పంచాయతీ నిధులు విడుదల చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ రోజు మేము విచారణకు వెళ్తున్నాము, సర్పంచ్ రమేష్ ఫోర్జరీ సంతకాలతో నిధులు తీసుకున్నారు తేలితే సర్పంచ్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము.:-ఎంపీఓ శ్రీనివాస్

Tags:    

Similar News