ప్రజాపాలన ప్రతీకార పాలన : దాస్యం వినయ్ భాస్కర్

గత ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి ఆరు గ్యారెంటీలు,

Update: 2024-07-04 15:34 GMT

దిశ, హనుమకొండ టౌన్ : గత ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన అని చెప్పి, ప్రతీకార పాలన తీర్చుకుంటుందని ప్రభుత్వ మాజీ చీప్ విప్,బి ఆర్ ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర వినయ్ భాస్కర్ అన్నారు. బాలసముద్రం లోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకతను కూడగట్టుకుందని అన్నారు. హామీలు నెరవేర్చకుంటే నిలదీస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులపై కేసులు పెడుతున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతూ శాంతి భద్రతలకు కూడా కాపాడలేని నిస్సహాయస్థితిలో ప్రస్తుత ప్రభుత్వం ఉందన్నారు.

తెలంగాణ స్వరాష్ట్ర సాధనే ద్యేయంగా నీళ్లు,నిధులు, నియామకాలు అనేటువంటి నినాదంతో అనేక ఉద్యమాలు చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, పదేళ్లలో బ్రహ్మాండంగా రైతాంగానికి సకాలంలో ఎరువులు, రైతుబంధు, రైతు బీమా ను అందించామని రుణమాఫీ కూడా చేశామని ఈ సందర్భంగా తెలిపారు. వారు ఇచ్చినటువంటి హామీల్లో రుణమాఫీ హామీని అమలు చేయలేక కాంగ్రెస్ పార్టీ నాయకులు తర్జనభర్జన పడుతున్నారని అన్నారు. ప్రజల పక్షాన కొట్లాడలని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ ప్రభుత్వం జిల్లా పార్టీ కార్యాలయాలకు స్థలాలను కేటాయించిందని అన్నారు. మిగతా పార్టీలకు ఏ విధంగానైతే స్థలాలను కేటాయించిందో బీఆర్ఎస్ పార్టీకి కూడా అదే విధంగా కేటాయించిందని ఈ సందర్భంగా తెలిపారు. కాంగ్రెస్ నాయకులు తెలంగాణ వ్యాప్తంగా అవినీతి, అసత్య ఆరోపణలు చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. సర్వేనెంబర్ 1066 లో ఒక ఎకరం భూమిని బి ఆర్ ఎస్ పార్టీ రూ. 4,84,000 కు కొనుగోలు చేసి పార్టీ కార్యాక్రమాలకు, పార్టీ కార్యకలాపాలకు వాడుతుందని అన్నారు.

కాంగ్రెస్ స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హనుమకొండ జిల్లా పార్టీ కార్యాలయం పై మున్సిపాలిటీ డిప్యూటీ కమిషనర్ కు జిల్లా పార్టీ కార్యాలయాలనికి కేటాయించిన భూమిని క్యాన్సిలేషన్ చేయాలని వినతి పత్రాన్ని అందజేశారని అన్నారు. వారు పంపినటువంటి నోటీసులకు వివరణతో కూడిన సమాధానాన్ని బుధవారం రోజున డిప్యూటీ కమిషనర్ కు అందించామని తెలిపారు. అన్ని పార్టీలకు కార్యాలయాలకు ప్రభుత్వమే భూములను కేటాయిస్తుందని, అలాగే హనుమకొండ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి కూడా మున్సిపాలిటీ స్థలాన్ని కేటాయించిందని వారు పార్టీ కార్యకలాపాలకు వాడకుండా ఆంధ్ర బ్యాంకుకు కిరాయి ఇచ్చారని అన్నారు. 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా,2009 నుంచి 2024 వరకు పని చేశానని వేరే పార్టీ నాయకుల పైన ప్రతీకార చర్యలు తీసుకోలేదని, అన్ని పార్టీల నాయకుల వ్యక్తిగత సమస్యలు, వారికి అనారోగ్యం సమస్యలు ఏర్పడినప్పుడు సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా కూడా సహాయ సహకారాలు అందించాలని అన్నారు.

ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే పార్టీలని తర్వాత ప్రజలందరూ సమానమేనన్న దాస్యం వినయ్ భాస్కర్ తనకంటే ముందుగా ముందు పని చేసినటువంటి ఎమ్మెల్యేలు ప్రజా సమస్యల పైన తన యొక్క సలహాలు సూచనలు తీసుకునేవారని, 30 ఏళ్ల రాజకీయ జీవితంలో కక్షపూరితంగా వ్యవహరించలేదని అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపైన, నాపైన వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ అక్రమ కేసులు పెడుతూ భయందోలనాలకు గురి చేస్తున్నారని అన్నారు. శ్రేణుల జోలికి వస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు. నిరుద్యోగుల యువకులకు జాబ్ క్యాలెండర్ను, 6 గ్యారెంటీ లు అమలు చేసే విధంగా, ప్రజలు నచ్చే విధంగా, ప్రజలు మెచ్చే విధంగా పరిపాలన సాగించాలని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హనుమకొండ జిల్లా పార్టీ కార్యాలయాన్ని కూల్చే కుట్ర చేస్తున్నారని, హనుమకొండ కార్యాలయం జోలికి రావద్దు అని టార్గెట్ కావొద్దు అని అన్నారు. గాంధీభవన్ కానీ, సీపీఐ, సీపీఎం, టిడిపి ఇతర పార్టీల కార్యాలయాలకు భూమిని కేసీఆర్ రాకముందే కేటాయించారని అన్నారు. ఖాదీ బోర్డు కు కేటాయించినటువంటి భూమి కూడా ప్రభుత్వ భూమి అని అన్నారు. పార్టీ కార్యాలయంలో ఇటుక పెళ్ల కదిపిన,గాంధీభవన్ కూల్తాదని హెచ్చరించారు. పార్టీ కార్యాలయాలు కట్టుకోవడానికి జీవోను అప్పుడున్నటువంటి నామినల్ రేట్ ప్రకారం ఇవ్వడం జరిగిందని, ఉమ్మడి రాష్ట్రంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి బోయినపల్లి మెయిన్ రోడ్ లో 10 ఎకరాల భూమిని రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్ కు కేటాయించారని, అది కూడా అదే జీవోను అనుసరించి కేటాయించారని అన్నారు. తను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు చాలామంది లేరని, జిల్లా పార్టీ కార్యాలయం కూడా మున్సిపాలిటీ కి చెందినటువంటి భూమిలోనే దగ్గరుండి కట్టించడం జరిగిందని గుర్తు చేశారు.

జీవోలను అనుసరించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు భూమిలను కేటాయించారని, వాటి జోలికి వస్తే జాగ్రత్త అని అన్నారు. పార్టీ కార్యలయాలను టచ్ చేస్తే, మీ పార్టీ కార్యాలయాలను కూడా టచ్ చేయాల్సి వస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఆంధ్ర బ్యాంకుకు ఏ విధంగా మీరు కిరాయికి ఇస్తారో తెలపాలని, కరీంనగర్ కాంగ్రెస్ జిల్లా ఆఫీసును పెళ్లిళ్లకు కిరాయి కి ఇస్తున్నారని, ఖమ్మంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కమర్షియల్ గా వాడుకుంటున్నారని అన్నారు. మీరు మీ మంత్రులు వెంటనే సమావేశమై మాట్లాడుకోవాలని, ఆత్మ విమర్శన చేసుకోవాలని సూచిస్తున్నానని తెలిపారు. అనంతరం దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ తాళ్లపల్లి జనార్దన్ గౌడ్, కోఆర్డినేటర్ పులి రజనీకాంత్, కార్పొరేటర్లు చెన్నం మధు,బోయిన్ పల్లి రంజిత్ రావు, నల్ల స్వరూపరాణి, ఇమ్మడి లోహిత రాజు,బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జానకి రాములు తదితరులు పాల్గొన్నారు.


Similar News