ప్రశాంతంగా సింగరేణి ఎన్నికలు.. భూపాలపల్లిలో ఐఎన్టీయూసీ విజయం
భూపాలపల్లి సింగరేణి ఏరియాలో బుధవారం కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చిన్న చిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది.
దిశ, వరంగల్ బ్యూరో: భూపాలపల్లి సింగరేణి ఏరియాలో బుధవారం కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చిన్న చిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. భూపాలపల్లి డివిజన్‌లో మొత్తం 5,410 మంది ఓటర్లు ఉండగా, 9 కేంద్రాల్లో పోలింగ్‌కు ఏర్పాట్లు చేశారు. 5,410 ఓట్లకు గాను 5,123 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 94.7 శాతం పో లింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. కాంగ్రెస్ అనుబంధ ఐఎన్‌టీయూసీ, సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ సంఘాల మధ్య హోరాహోరీ పోరు జరిగింది.
సింగరేణి మినీ ఫంక్షన్ హాల్‌కు 5 టే బుల్స్ ఏర్పాటు చేసి సాయంత్రం 7 గంటలకు ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్ ప్రారంభించారు. మొత్తం 13 కార్మిక సంఘాలు ఈ ఎన్నికల బరిలో నిలిచాయి. సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ - కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ మధ్యనే ప్రధానంగా పోటీ నెలకొంది. భూపాలపల్లి డివిజన్‌లో కాంగ్రెస్ అనుబంధ కార్మిక యూనియన్ ఐ ఎన్ టీ యూ సీ విజయం సాధించింది. ఏఐటీయూసీ గట్టి పోటీ ఇచ్చినప్పటికి చివరికి ఐఎన్ టీయూసీకే విజయం వరించింది.