అక్ర‌మాల ఆట‌.. రిజిస్ట్రేష‌న్ల జాత‌ర‌

అధికారులు స‌హ‌క‌రిస్తే అక్ర‌మాల‌కు అడ్డేముంటుంది?. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌తో, అనుమ‌తుల‌తో ప‌నేముంటుంది?

Update: 2023-02-15 15:41 GMT

దిశ‌, హ‌న్మ‌కొండ టౌన్: అధికారులు స‌హ‌క‌రిస్తే అక్ర‌మాల‌కు అడ్డేముంటుంది?. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌తో, అనుమ‌తుల‌తో ప‌నేముంటుంది?. దొంగ‌లు దొంగ‌లు ఊళ్లు పంచుకున్న చందంగా.. లాభాల్లో క‌మీష‌న్లు పుచ్చుకుంటూ, అక్ర‌మాల‌కు అందినంత స‌హ‌క‌రించేస్తున్నారు Also, officials of Dharmasagar Tehsildar office are committing irregularities. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రానికి అత్యంత చేరువలో ఎల్కుర్తి గ్రామ పరిధిలో ఓ భారీ నాన్ లే అవుట్‌తో కొంత‌మంది వ్యాపారులు ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నారు. ఎల్కుర్తి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 1146/B4/1/1,758/2, 759/1,760, 761/B/1/1/1/1లలో సుమారు నాలుగున్నర ఎకరాల స్థలంలో నాన్ లేఅవుట్ వెంచర్ చేశారు.

ఈ అక్ర‌మ నాన్ లే అవుట్ బండారాన్ని గ‌త సంవ‌త్స‌రం న‌వంబ‌ర్‌లోనే దిశ బ‌య‌ట‌పెట్టింది. అక్ర‌మ నాన్ లే అవుట్‌పై వ‌రుస‌గా క‌థ‌నాలు రావ‌డంతో ఎట్ట‌కేల‌కు కుడా సిటీ ప్లాన‌ర్ అజిత్ రెడ్డి ఆదేశాల‌తో అసిస్టెంట్ ప్లాన‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఈ వెంచ‌ర్లో ఏర్పాటు చేసిన ప్లాట్ల రాళ్ల‌ను నామ‌మాత్రంగా తొల‌గించారు. కొద్దిరోజులు ప్లాట్ల దందాను నిలిపేసిన అక్ర‌మ వెంచ‌ర్ నిర్వాహాకులు గ‌త నెల‌న్న‌ర రోజులుగా మ‌ళ్లీ య‌థావిధిగా దందా సాగిస్తుండ‌టం విశేషం. 


త‌హ‌సీల్దార్ ఇష్టారాజ్యం..!?

అక్ర‌మ వెంచ‌ర్‌పై ప‌లుమార్లు మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నా త‌హ‌సీల్దార్ ర‌జిత మాత్రం డోంట్ కేట‌ర్ అన్న‌ట్లుగా అక్ర‌మార్కుల‌కు స‌హ‌క‌రించేస్తున్న‌ట్లుగా ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. నాన్ లే అవుట్ వెంచ‌ర్ల‌లో ప్లాట్ల‌కు ఓ ప్ర‌త్యేక రేటు ఫిక్స్ చేసి మ‌రీ రిజిస్ట్రేష‌న్లు పూర్తి చేస్తున్న‌ట్లుగా విశ్వ‌స‌నీయంగా తెలిస్తోంది. గ‌డిచిన కొద్ది నెల‌లుగా ధ‌ర్మ‌సాగ‌ర్ మండలంలోని ప‌లు గ్రామాల్లో నాన్ లే అవుట్ దందా ద‌ర్జాగా కొన‌సాగుతుండ‌టానికి త‌హ‌సీల్దార్ ర‌జితతో పాటు కార్యాల‌యంలోని ఆర్ ఐల స‌హ‌కార‌మే కార‌ణ‌మ‌న్న అభిప్రాయం రియ‌ల్ ఎస్టేట్ వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతుండ‌టం గ‌మ‌నార్హం. ఎల్కుర్తి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 1146/B4/1/1,758/2, 759/1,760, 761/B/1/1/1/1లలో వెలిసిన వెంచ‌ర్ అక్ర‌మాల‌ను తెలుసుకునేందుకు ఏస‌ర్వే నెంబ‌ర్‌తో ఎన్ని బై నెంబ‌ర్ల‌తో రిజిస్ట్రేష‌న్లుపూర్తి చేశారో ప‌రిశీలిస్తే స‌రిపోతుంద‌ని కూడా సూచిస్తున్నారు.

ఈ వెంచ‌ర్ దందాకు సంబంధించింది మ‌చ్చుకేన‌ని. కానీ ఔట‌ర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న ప‌లు గ్రామాల్లో జ‌రుగుతున్న నాన్ లే అవుట్ రిజిస్ట్రేష‌న్ల‌న్నీ కూడా ఫాంల్యాండ్ కింద చేసేస్తూ ప‌ట్టాపాస్ పుస్త‌కం జారీ చేస్తున్నారు. అయితే ఏకంగా 3,4,5 ఎక‌రాల విస్తీర్ణంలో వెంచ‌ర్లు ఏర్పాటు చేసి అక్ర‌మంగా సాగిస్తున్న దందాకు త‌హసీల్దార్‌,కుడా జేపీవోల స‌హ‌కార‌మే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. ఆర్డీవో వాసుచంద్ర‌తో పాటు జిల్లా ఉన్న‌తాధికారులు ధ‌ర్మ‌సాగ‌ర్ కార్యాల‌యంలో జ‌రుగుతున్న రిజిస్ట్రేష‌న్ అక్ర‌మాల‌పై దృష్టిసారిస్తే ఇంకా అనేక విష‌యాలు వెలుగులోకి వ‌స్తాయ‌ని కూడా చెబుతున్నారు.

Tags:    

Similar News