యూనివర్సిటీయే ప్రధానం.. వ్యక్తులు కాదు..

కాకతీయ విశ్వవిద్యాలయంను మే నెల 25, 26, 27 తేదీలల్లో న్యాక్ బృందం సందర్శించనున్న నేపధ్యంలో ముందుస్తుగా యూనివర్సిటీ పనులను, వైస్ ఛాన్సలర్ ఆచార్య తాటికొండ రమేష్ సమీక్షించారు.

Update: 2023-05-06 12:52 GMT

దిశ, కేయూ క్యాంపస్ : కాకతీయ విశ్వవిద్యాలయంను మే నెల 25, 26, 27 తేదీలల్లో న్యాక్ బృందం సందర్శించనున్న నేపధ్యంలో ముందుస్తుగా యూనివర్సిటీ పనులను, వైస్ ఛాన్సలర్ ఆచార్య తాటికొండ రమేష్ సమీక్షించారు. రిజిస్ట్రార్ ఆచార్య టి.శ్రీనివాస రావు అధ్యక్షతన, విశ్వవిద్యాలయ సెనెట్ హాల్ లో ఉదయం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ముఖ్యఅతిధిగా విచ్చేసి ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సమన్వయము సమయస్పూర్తితో వ్యవహరించాలని కోరారు.

ప్రతిరోజూ ఎంతో కొంత మేధోమధనం జరగవలసిందేనన్నారు. ప్రతిరోజు చర్యలనుగా క్రమబద్ధంగా చేపట్టినట్లైతే చివరి నిమిషంలో హడావుడి ఉండదన్నారు. పోజిటివ్ ధీమా ఉన్నప్పటికీ అప్రమత్తత అవసరం అన్నారు. సిలబస్ మార్పులను, విభాగబలాలను పవర్ పాయింట్ లో చూపాలని యూనివర్సిటీలో పండగ వాతావరణం నెలకొల్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ అకాడమిక్ అడ్వైజర్ ఆచార్య ఎన్.గోపికృష్ణ క్వాలిటేటివ్ పై దృష్తి పెట్టాలి అన్నారు. ఆచార్య పి.కృష్ణమాచారి ఐక్యూ ఏసీ డైరెక్టర్ ఆచార్య ఎస్.నరసింహ చారి, ఆచార్య ఆర్.మల్లికార్జున రెడ్డి బోధనా, ఒప్పంద, పార్ట్ టైం, అడ్జెంక్ట్ ఫాకల్టీ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:    

Similar News