'స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుకు కృషి చేస్తా'

Update: 2023-09-30 11:08 GMT

దిశ, వరంగల్‌ టౌన్‌: వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ అన్నారు. 67వ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌-2023 ఆధ్వర్యంలో శంభునిపేట ప్రభుత్వ పాఠశాలలో జరిగిన జిల్లా స్థాయి అండర్‌-14, అండర్‌-17 కబడ్డీ, కోకో, వాలీబాల్‌ వరంగల్‌ జోన్‌ లెవెల్‌ సెలెక్షన్స్‌ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో వరంగల్‌ తూర్పు నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. 90 శాతం నిరుపేదలు ఉన్న ఈ నియోజకవర్గంలో ఏడు గురుకుల పాఠశాలలు నెలకొల్పినట్లు చెప్పారు.


రూ. ౧౨౫౦ కోట్లతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్నట్లు తెలిపారు. కలెక్టరేట్‌, అధునాతన బస్టాండ్‌ రాబోతున్నాయన్నారు. డిస్ట్రిక్ట్‌ స్పోర్ట్స్‌ ఆఫీస్‌ను ఓ సిటీ ఇండోర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తాను మేయర్‌గా ఉన్నప్పుడు జెఎన్‌ఎస్‌లో సింథటిక్‌ ట్రాక్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ కట్టించి తీరుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పోశాల పద్మ, బాలిన సురేష్‌, ఎంఈఓ విజయ్‌ కుమార్‌, హెచ్‌ఎంలు శారదా బాయి, పుసారాం, వెంకట్‌ రెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌, సలార్‌, రవీందర్‌, హైమత్‌ ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.


Similar News