ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది..
కేసముద్రం మండలంలోని కల్వల గ్రామంలో (కేసముద్రం పీఏసీఎస్) వారి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డా.భూక్యా మురళి నాయక్ ప్రారంభించారు.
దిశ, కేసముద్రం : కేసముద్రం మండలంలోని కల్వల గ్రామంలో (కేసముద్రం పీఏసీఎస్) వారి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డా.భూక్యా మురళి నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం, రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తుందన్నారు. గిట్టుబాటు ధర వచ్చేలా రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలన్నారు. ఏ గ్రేడ్ తేమ శాతం వచ్చేలా చూసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నధాన్యానికి రూ.500 లు బోనస్ ఇస్తుందన్నారు. రైతులు దళారులను నమ్మకుండా నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలన్నారు. క్వింటాలుకు ఏ గ్రేడ్ ధాన్యం రూ.2320, సాధారణ ధాన్యం రూ.2300 రేటును నిర్ణయించిందన్నారు.
రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, ధన్నసరి సింగిల్ విండో వైస్ చైర్మన్, మండల అధ్యక్షుడు అల్లం నాగేశ్వరరావు, కేసముద్రం సింగిల్ విండో వైస్ చైర్మన్, అంబాటి మహేందర్ రెడ్డి, మాజీ చైర్మన్ బండారి వెంకన్న, డైరెక్టర్లు, జిల్లా నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు,అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.