Mamunur Airport : మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి రూ. 205 కోట్ల విడుదల
వరంగల్(Warangal) జిల్లా మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణాని(Mamunur Airport)కి కీలక ముందడుగు పడింది. ఎయిర్ పోర్ట్ విస్తరణకు అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు రూ. 205 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది.
దిశ, వెబ్ డెస్క్ : వరంగల్(Warangal) జిల్లా మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణాని(Mamunur Airport)కి కీలక ముందడుగు పడింది. ఎయిర్ పోర్ట్ విస్తరణకు అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు రూ. 205 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి సంబంధించి డిజైన్లతో కూడిన డీపిఆర్ ను సిద్ధం చేయాలని ఎయిర్ పోర్ట్ అథారిటీకి ఆర్ ఆండ్ బీ శాఖ లేఖ రాసింది. మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల పరిధి ఒప్పందాన్ని జీఎమ్మాఆర్ సంస్థ విరమించుకుంది. ఇప్పటికే ఎయిర్ పోర్ట్ పరిధిలో 696 ఎకరాల భూమిని గుర్తించారు. 253 ఎకరాల భూమిలో కొంత రన్ వే విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్, ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్), నెవిగేషనల్ ఇన్ స్ట్రూమెంట్ ఇన్ స్టలేషన్ విభాగాల కోసం నిర్మాణాల కోసం వినియోగిస్తారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చొరవతో మామూనూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో ముందడుగు పడింది. ఎయిర్ పోర్టు నిర్మాణ పనులను సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 19న తన వరంగల్ పర్యటనలో భాగంగా ప్రారంభించనున్నట్లుగా సమాచారం. హైదరాబాద్‌కు ధీటుగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తుంది. వరంగల్ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వరంగల్ విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచనతో మామునూరు ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంది.