సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి..
దేవరుప్పుల మండల పరిధి పెద్ద మడూర్ గ్రామంలో ఆదివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ప్రారంభించారు.
దిశ, దేవరుప్పుల: దేవరుప్పుల మండల పరిధి పెద్ద మడూర్ గ్రామంలో ఆదివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న చేసిన పోరాటాలను, చరిత్రను కొనియాడారు. సర్వాయి పాపన్న విగ్రహ దాత, కంఠమహేశ్వర స్వామీ ఆలయ సుందరీకరణకు సహకరించిన బబ్బురి శ్రీకాంత్ ను మంత్రి ప్రశంసించారు. ఎంత సంపాదించినా పుట్టిన ఊరుకు సేవ చేయాలని అన్నారు. ఎంతో మంది ఎంతో సంపాదించారు కానీ శ్రీకాంత్ లా సేవ చేసే వారు తక్కువ అని కొనియాడారు.
గౌడ కులస్తులు అందరూ ఏకంగా ఉండి ఇంకా సంఘాన్ని బలోపేతం చేసుకోవాలని సూచించారు. ఆలయ ప్రాంగణంలో మినీ ఫంక్షన్ హాల్ కోసం రూ.10 లక్షలు మంజూరు చేస్తా అని తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్, ఎంపీపీ భస్వ సావిత్రి మల్లేష్, జడ్పీటీసీ పల్లా భార్గవి, సుందర్, రామిరెడ్డి, గ్రామ సర్పంచ్ సుజనా పెద్దారెడ్డి, ఎంపీటీసీ పానుగంటి గిరి తదితరులు పాల్గొన్నారు.