కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం: ఎమ్మెల్యే గండ్ర
కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం లభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.
దిశ, రేగొండ: కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం లభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం తిరుమలగిరి, రేగొండ గ్రామాలలో రూ.40 లక్షల అంచనా వ్యయంతో చేపడుతున్న నూతన ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం భవనాల నిర్మాణానికి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధే లక్ష్యంగా దూసుకుపోతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్య రంగానికి కోట్ల రూపాయల నిధులను కేటాయించి ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తుందన్నారు.
ఇప్పటికే గర్భిణుల ఆరోగ్య విషయంలో న్యూట్రిషన్ కిట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. త్వరలోనే భూపాలపల్లికి మెడిసిన్ కళాశాల రాబోతున్నట్లు తెలిపారు. భూపాలపల్లి వంద పడకల ఆసుపత్రిలో అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పున్నం లక్ష్మిరవి, జడ్పీటీసీ సాయిని విజయ, వైద్య అధికారిని హిమబిందు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు అంకం రాజేందర్, పీఏసీఎస్ చైర్మన్ నడిపెళ్లి విజ్జన్ రావు, రేగొండ సర్పంచ్ నిశిధర్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మోడెం ఉమేష్ గౌడ్, కోలేపాక బిక్షపతి, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ రహీం పాషా, ఎంపీటీసీలు మైస సుమలత, అయిలి శ్రీధర్ గౌడ్, ప్రతాప్ రెడ్డి, గంట గోపాల్ తదితరులు పాల్గొన్నారు.