కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాదు : మంత్రి కేటీఆర్

కేసీఆర్ అంటే అందరూ కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు అనుకుంటున్నారని, కేసీఆర్ అంటే కే-అంటే.... KTR hits out at BJP

Update: 2023-03-08 12:08 GMT

దిశ, మహబూబాబాద్ ప్రతినిధి: కేసీఆర్ అంటే అందరూ కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు అనుకుంటున్నారని, కేసీఆర్ అంటే కే-అంటే కాలువలు, సీ-అంటే చెరువులు, ఆర్ -అంటే రిజర్వాయర్లు అని రాష్ట్ర మంత్రి కేటీఆర్ తెలిపారు. బుధవారం మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 75 ఏండ్ల క్రితం రైతుల కోసం సామాన్య ప్రజల కోసం ఎవ్వరు ఆలోచించలేదని, కేవలం కేసీఆర్ అన్ని వర్గాలు ప్రజల కోసం పరితపిస్తున్నాడని తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. మహిళ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు వివిధ పథకాల ద్వారా రూ. 1550 కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని కొడకండ్ల మండలంలో రూ. 20 కోట్లతో మినీ టైక్స్ టైల్స్ పార్క్ మంజూరు చేస్తూ జీవో కాపీని సభ వేదిక ద్వారా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుకు అందజేశారు. నియోజకవర్గ మహిళలలకు 10 వేల కుట్టు మిషన్ లు అందజేశారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏమి చేయలేదని ఆ పార్టీలకు, ప్రధాని మోడీకి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నాడని అన్నారు. వన్ నేషన్- వన్ మార్కెట్, వన్ నేషన్ -వన్ రేషన్ అన్న ప్రధాని వన్ నేషన్-వన్ ఫ్రెండ్ అని, దేశంలో దోచుకున్న సంపదను వక్రమార్గంగా అదానీ కంపెనీలలో పెట్టి, వాటి అక్రమ డబ్బులతో ప్రభుత్వాలను కూల్చడం, పార్టీలలో చీలిక తేవడం, ఎమ్మెల్యే, ఎంపీలను కొనుగోలు చేయడం పనిగా పెట్టుకున్నారని మోడీ, బీజేపీ పై ఫైర్ అయ్యారు.

నల్లధనం వెలికి తీస్తానని ఎందుకు తియ్యలేదో చెప్పాలని అన్నారు. జన్ ధన్ యోజన ద్వారా బ్యాంకు ఖాతాలు తెరిస్తే అందరి అకౌంట్లలో రూ. 15 లక్షల రూపాయలు పడతాయని మోడీ నమ్మబలికాడని మరి ఎవ్వరి అకౌంట్ లలో ఒక్కరూపాయి కూడా పడలేదని అన్నారు. కాళేశ్వరం నీళ్లు, 24 గంటల కరెంట్ తో ప్రజలు ఆనందంగా ఉన్నారని, తెలంగాణ రాక ముందుకు రైతులు, సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్ లో రూ. 20 వేల కోట్లతో ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. ములుగు జిల్లాలో గిరిజన యునవర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ మరిచి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. హిందు, ముస్లింల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు దండుకోవడమే బీజేపీ పని అని అన్నారు. తండాలను గ్రామ పంచాయితీలుగా చేయడంతోపాటు అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 20 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సభలో తెలిపారు. దీంతో అక్కడ ఉన్నవారంతా కేటీఆర్ సీఎం.. సీఎం అని హోరోత్తించారు. నియోజకవర్గ పరిధిలో పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం తొర్రూరులో కేటీఆర్ చేతులు మీదుగా పలు పనులకు శంకుస్థాప‌నులు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లు,ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు ,ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags:    

Similar News