Kaleshwaram project : కాలేశ్వరం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
దిశ, కాటారం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాలేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. వాగులు, నదుల నుండి వరద ప్రవాహం గోదావరి నదికి చేరుతుంది. మహారాష్ట్రలో ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత నది ద్వారా కాలేశ్వరంలో త్రివేణి సంగమ తీరం
వద్ద గోదావరి నదికి వరద ఉధృతి కొనసాగుతోంది. అన్నారం ప్రాజెక్టుకు 12,500 క్యూసెక్కులు, మేడిగడ్డ ప్రాజెక్టులో 3,10,000 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. కాలేశ్వరంలో గోదావరి ప్రాణహిత నదుల త్రివేణి సంగమ తీరంలో నీటి ప్రవాహం 8.410 మీటర్లు గా ఉంది. వాయుగుండం ప్రభావం నేపథ్యంలో భూపాలపల్లి జిల్లాలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు.