Janagam Collector : సర్వే శాఖ పనితీరును మెరుగు పరుచుకోవాలి

సర్వే శాఖ పనితీరు పై కలెక్టర్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్ లో

Update: 2024-09-21 12:30 GMT

దిశ,జనగామ: సర్వే శాఖ పనితీరు పై కలెక్టర్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్ లో సహాయ సంచాలకుల ఆధ్వర్యంలో సంబంధిత సర్వే శాఖ అధికారులు, సిబ్బందితో  కలెక్టర్ సమీక్షించారు. 486 సర్వే చేయాల్సి ఉన్నందున పనుల్లో జాప్యం తగదని వేగవంతం చేయాలన్నారు.రోజువారీ లక్ష్యాలను రూపొందించుకోవాలని సర్వే అధికారులను ఆదేశించారు. కోర్టు కేసుల వరకు వెళ్లకుండా చేసుకోవాలన్నారు.

సర్వే చేపట్టి నిర్దేశించిన గడువు లోగా పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని, జనగామలో పెండింగ్ ఎక్కువగా ఉందన్నారు.అక్టోబర్ 21వ తేదీ లోగా సర్వేలన్నీ పూర్తి చేయాలని, గూగుల్ షీట్ రూపొందించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు.టీ ఎమ్ 33 లో ప్రభుత్వ స్థలాలు,కాలువలు,వక్ఫ్ బోర్డు,ఎఫ్.టి.ఎల్.పరిధిలోని చెరువులు, కుంటలను సర్వే చేసి నివేదిక ఇవ్వాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు మాన్యం కొండ,ఉప సర్వే అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


Similar News