ఆర్‌డబ్ల్యూఎస్ స్కీంలో అక్రమాల ఆట.. ఏకంగా కోటి మింగారు?
ములుగు జిల్లా మంగపేట మండలంలోని మేజర్ గ్రామపంచాయతీలో కార్యదర్శి అక్రమాల ఆట సాగించినట్లు స్పష్టమవుతోంది. మండలంలో మేజర్ గ్రామపంచాయతీకి ప్రతి నెల లక్షల రూపాయలలో గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు జమ చేస్తోంది
దిశ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా మంగపేట మండలంలోని మేజర్ గ్రామపంచాయతీలో కార్యదర్శి అక్రమాల ఆట సాగించినట్లు స్పష్టమవుతోంది. మండలంలో మేజర్ గ్రామపంచాయతీకి ప్రతి నెల లక్షల రూపాయలలో గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు జమ చేస్తోంది. సర్పంచులు లేని కారణంగా ఈ గ్రామ పంచాయతీకి కార్యదర్శి , ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీకి సంబంధించిన అన్ని ఆర్థిక లావాదేలు వీరిద్దరి సంతకాలతోనే ముడిపడి ఉంటాయి. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ వచ్చిన తర్వాత స్థానిక సంస్థలకి గతంలో ఆర్డబ్ల్యూఎస్ స్కీం ద్వారా నీటిని సరఫరా చేసే స్కీం రద్దు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇంటింటికి నల్లాల ద్వారా నిత్యం స్వచ్ఛమైన తాగునీరు అందిస్తూనే ఉంది. ప్రస్తుతం ఆర్డబ్ల్యూఎస్ స్కీం స్థానిక సంస్థలలో అమలులో లేకపోయినా కె ఎస్ ఆర్ కన్స్ట్రక్షన్స్ పేరిట(కొత్త మోటర్లు కొనుగోలు పేరుతో, మోటార్ల రిపేర్ పేరుతో) నిధులు కొల్లగొట్టినట్లుగా సమాచారం. సామాగ్రి కొనుగోళ్లకు సంబంధించిన వ్యయ రికార్డులు దిశకు లభ్యమయ్యాయి. ఎంబి రికార్డ్ మరియు ఇంకో ఫర్మ్ పేరు మీద సుమారు రూ. 10లక్షలు ఖర్చుపెట్టిన ఘనత కమలాపురం,రాజుపేట గ్రామపంచాయతీ కార్యదర్శులకు, ప్రత్యేక అధికారులకే చెల్లడం విశేషం.
కమలాపురం గ్రామపంచాయతీలో ..
1) తేది:29-3-2023న కొత్త మోటర్ కొనుగోలు, రిపేరు, పైపు లైన్ లీకేజీల పేరుతో 274374/- రూపాయల నిధులు కెఎస్అర్ కన్స్ట్రక్షన్స్ పేరుమీద నిధులు డ్రా చేసారు. తేది: 05-05-2023 న కొత్త మోటర్, పిపివి పైపు లైన్ పేరుతో 100000/- ( లక్ష రూపాయలు), గోదావరి రోడ్డులో కొత్త బోరు, మోటార్ కొనుగోలు పేరుతో 178,200/-( లక్ష డెబ్బై ఎనిమిది వేల రెండు వందలు),కొత్త మోటర్, పిపివి పైపు లైన్ రిమైనింగ్ పేమెంట్ పేరుతో 78,432/-( డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై రెండు రూపాయలు) మొత్తంగా 356632/- (మూడు లక్షల యాబై ఆరువేల ఆరువందలముప్పై రెండు రూపాయలు) కె ఎస్ ఆర్ కన్స్ట్రక్షన్స్ పేరుమీద ఎంబి రికార్డు చేసి ఆ సంస్థకు నిధులు చెల్లించారు. కానీ అదే కె ఎస్ ఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థకి 29-03-2023 ఇచ్చిన పనిలో ఎంబి రికార్డు సంబంధించిన సమాచారం ఏమీ లేదు.ఈ పనికి ఏ విధంగా నిధులు కట్టబెట్టారు అనేది ప్రజల ప్రశ్న విడీసీ సభ్యుల తీర్మానం ఉందా లేదా అని ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. 3)తేది:16-06-2023 గ్రామ పంచాయతీ ఆఫీస్ కి కొత్త మోటర్ కొనుగోలు పేరుతో 46,500/-, సుభాష్ చంద్రబోస్ కాలనీకి కొత్త మోటర్ కొనుగోలు పేరుతో 35,000/-గుడ్డేలుగులపల్లిలో కొత్త మోటర్ కొనుగోలు పేరుతో 54,500/- రూపాయలు. తేది:16-06-2023 కమలాపురం గ్రామ పంచాయతీలో మోటార్ల కొనుగోలు పేరుతో మొత్తంగా 136000/- (లక్ష ముప్పై అరు వేల రూపాయలు) హుస్సేన్ ఐరన్ అండ్ ఎలక్ట్రికల్స్ పేరు మీద నిధులు చెల్లించారు.
రాజుపేట గ్రామపంచాయతీలో..
1)తేదీ: 01-01-2023 న రాజుపేట గ్రామపంచాయతీలో రైతు వేదికకి నిర్వహణ పేరుతో 67562/- రూపాయల ఖర్చుతో నిధులు డ్రా చేశారు.2) పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ నిమిత్తంతేది:27-12-2022 న 65000/- రూపాయలు,
తేది:28-12-2022 న 167000/- రూపాయలు, తేది:28-12-2022 న 4006/- రూపాయలు,
తేది:31-12-2022 న 65000/- రూపాయలు, తేది:06-01-2023 న 34853/- రూపాయల నిధులు పారిశుధ్యం పేరుతో 335859/- (మూడు లక్షల ముప్పైఐదు వేల ఎనిమిది వందల యాబై తొమ్మిది రూపాయలు). కేవలం ఇది ఒక ఉదాహరణ మాత్రమే...తవ్వే కొద్ది మేజర్ గ్రామపంచాయతీ అవినీతి కథలు బయటపడుతున్న సందర్భంలో మండల ప్రత్యేక అధికారి కాని, డిఎల్ పి ఓ,డిపిఓ కానీ మంగపేట మండలం పై పర్యవేక్షణ చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారే తప్ప అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవడం లేదని జిల్లాస్థాయి అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలానికి ఉన్నతాధికారులు తనిఖీల పేరుతో విందులు వినోదాల కోసం చుట్టపు చూపుగా వస్తున్నారేమో అని మండల వ్యాప్తంగా ప్రజలు అధికారుల తీరును ప్రజలు ఈసడించుకుంటున్నారు.