ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు : తహశీల్దార్

ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని

Update: 2024-07-04 15:25 GMT

దిశ, వర్థన్నపేట : ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని తాసిల్దార్ విక్రమ్ కుమార్ అన్నారు.హనుమకొండ జిల్లా ఐనవోలు గ్రామంలో రెవెన్యూ శివారులోని సర్వే నెంబర్ 1150 విస్తర్ణం ఏ 1.07గుంటలు మరియు సర్వే నెంబర్ 1163 విస్తర్ణం ఏ 0.34గుంటలు మొత్తం విస్తర్ణం ఏ 2.01గుంటల భూమిని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కోసం ప్రభుత్వం కొనుగోలు చేసింది. నివాస గృహములు కొరకు కొనుగోలు చేసినటువంటి ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించుకున్నారు.యిట్టి భూమిని రెవెన్యూ జిపి అధికారులు కలిసి భూమి చుట్టు హద్దు రాళ్ళను నాటారు. ఆ భూమిలో ప్రభుత్వ భూమి గా నోటీసు బోర్డు ఏర్పాటు చేశారు.


Similar News