భారీ మెజార్టీతో గెలుస్తా.. దాస్యం వినయ్ భాస్కర్
హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎన్నికల ఇంచార్జ్ మర్రి యాదవ రెడ్డి సభాధ్యక్షతన బీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి అనుచరులు సుమారు 600 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
దిశ, హనుమకొండ టౌన్ : హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎన్నికల ఇంచార్జ్ మర్రి యాదవ రెడ్డి సభాధ్యక్షతన బీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి అనుచరులు సుమారు 600 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరినీ వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, డివిజన్ ఇంచార్జిల సమక్షంలో అందరినీ సమన్వయం చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హాజరై మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ అని, ఆనాడు 2001లో తెలంగాణ స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా ప్రారంభించినటువంటి పార్టీ, రాష్ట్రం సాధించిన తర్వాత బంగారు తెలంగాణ ధ్యేయంగా మునుముందుకు సాగుతుందన్నారు.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఇటీవల బీజేపీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరికైన రాకేష్ రెడ్డి తన అనుచరులు సుమారు 600 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారిని ఉద్దేశించి ప్రభుత్వ చీఫ్ విప్ మాట్లాడుతూ అందరినీ సమన్వయం చేసి, అన్ని డివిజన్లలో బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు ఇప్పుడు చేరినటువంటి నాయకులకు సైతం సమాన్యాయం చేయాలని, వారందరినీ కలుపుకుపోవాలని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లో గల కార్పొరేటర్లు, డివిజన్ ఇంచార్జులు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల్లాగా అందరూ కలిసిమెలిసి ఉండి, ఐక్యతతో పనిచేసి భారీ మెజారిటీ సాధించే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలన్నారు. ఈ 20 రోజులు ప్రతిఒక్కరు సైనికుల్లాగా పనిచేయాలని అన్నారు.
ఇటీవల కేటీఆర్ ఇక్కడి సమావేశానికి వచ్చినప్పుడు గతంలో ఎంత మెజారిటీ వచ్చింది అంటే 37,000 అని చెప్పానని, ఇప్పుడు 50,000 దాటాలని ఆయన చెప్పారని అన్నారు. కానీ ఇప్పుడు మీ అందరిని చూస్తుంటే ఆ మెజారిటీ కంటే ఎక్కువనే వస్తుందన్నారు. బీఆర్ఎస్ లో ఇటీవల చేరిన రాకేష్ రెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాత కేసీఆర్ అని, భవిష్యత్తు తెలంగాణ నిర్మాత కేటీఆర్ అని, వారి సారథ్యంలో భారత రాష్ట్ర సమితిలో ఎంతోమందిని యువ ప్రజాప్రతినిధులు తయారు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు రుణవిమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, వరంగల్ తూర్పు పశ్చిమ ఎన్నికల సమన్వయకర్త ఈగ మల్లేశం, పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల కన్వీనర్ జనార్ధన్ గౌడ్, కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, సోదా కిరణ్, గుంటి రజిత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.