దిశ, మహబూబాబాద్: రైతాంగాన్ని మాయమాటలతో మభ్యపెడుతూ టీఆర్ఎస్ కాలం వెళ్లదీస్తోందని మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నాయకులు పి.బలరాం నాయక్ అన్నారు. టీఆర్ఎస్‌కు, కేసీఆర్‌కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. పంట పరిశీలన పేరుతో మంత్రులు పర్యటనలకే పరిమితమయ్యారని పేర్కొన్నారు. ఎకరానికి లక్ష రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు పెద్ద పీట వేసి, ఏకకాలంలో రుణ మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. సమావేశంలో బెల్లయ్య నాయక్, జెన్నారెడ్డి వెంకటేశ్వర్లు, మేకల వీరన్న యాదవ్, రియాజ్, వంశీ నాయక్, ముజ్జు, నవీన్, ఫారూఖ్ పాల్గొన్నారు.