రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

రాష్ట్రంలో రైతు సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తుందని తెలంగాణలో పండించిన ప్రతి వడ్ల గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు కొనుగో

Update: 2023-04-13 07:49 GMT

దిశ, రాయపర్తి: రాష్ట్రంలో రైతు సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తుందని తెలంగాణలో పండించిన ప్రతి వడ్ల గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని ధాన్యాన్ని అమ్ముకొని గిట్టుబాటు ధర పొందాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు.

గురువారం మండల కేంద్రంలోని పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు వలన రైతులకు సాగునీరు అందిస్తుండడంతో భూగర్భ జలాలు బాగా పెరిగి రెట్టింపు ఉత్సాహంతో రైతులు వ్యవసాయం చేసి ధాన్యాన్ని బాగా పండిస్తున్నారు. పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్ముకొని రైతులు మోసపోకుండా దాన్ని కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఈ కేంద్రాలను రైతు సద్దినం చేసుకొని దాన్ని నమ్ముకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జెడ్పీటీసీ రంగు కుమార్ పిఎసిఎస్ చైర్మన్ కుందూరు రామచంద్ర రెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మూణావత్ నరసింహ నాయక్, జిల్లా నాయకులు బిల్లా సుధీర్ రెడ్డి, ఎండి నయం సర్పంచ్ గారి నర్సయ్య ఎంపీటీసీ అయిత రామచంద్ర, బిల్లా రాధిక తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News