దుగ్గొండిలో విషాదం.. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Update: 2022-02-05 16:43 GMT

దిశ, దుగ్గొండి: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో అప్పుల బాధతో రైతు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక ఎస్ఐ నవీన్ కుమార్ వివరాల ప్రకారం.. మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన ములుగు సూరయ్య(55) తనకున్న రెండు ఎకరాల వ్యవసాయ భూమిలో మిర్చి పండించాడు. పెట్టుబడికి అప్పులు చేశాడు. పంట చేతికి అందే సమయానికి అకాల వర్షాలు, వడగండ్ల వాన రావడంతో పంట పూర్తిగా ధ్వంసమైంది. దీంతో పంటల కోసం తెచ్చిన అప్పులు తీర్చలేని స్థితిలో ఉన్న సూరయ్య గతకొన్ని రోజులుగా మనస్తాపానికి గురయ్యాడు. గత బుధవారం రోజున సాయంత్రం వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశాడు. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం నర్సంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందారు. మృతుడి భార్య ప్రమీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నవీన్ కుమార్ తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.

Tags:    

Similar News