వరంగల్ ఎంజీఎం సూపరిండెంట్ రాజీనామా...

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి సూపరిండెంట్ పదవి అంటేనే డాక్టర్లు భయపడుతున్నారు. అది ఎందుకు అనేది చర్చనీయాంశంగా మారింది.

Update: 2024-11-19 16:19 GMT

దిశ, వరంగల్ : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి సూపరిండెంట్ పదవి అంటేనే డాక్టర్లు భయపడుతున్నారు. అది ఎందుకు అనేది చర్చనీయాంశంగా మారింది. కొన్ని నెలల క్రితమే ఎంజీఎం ఆస్పత్రి సూపరిండెంట్ గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ మురళి కొన్ని రోజులుగా మౌనం వహిస్తూ నేడు అనగా మంగళవారం తన వ్యక్తిగత కారణాలవల్ల తన సూపరిండెంట్ పదవికి రాజీనామా చేస్తూ డీఎంఈ కి రాజీనామా లేఖను సమర్పించగా దానిని ప్రభుత్వం ఇంకా ఆమోదించనట్లుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది, ఏంటి అని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎంజీఎం ఆస్పత్రిలో సూపరిండెంట్ పదవికి బాధ్యతలు చేపట్టాలంటే డాక్టర్లు భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకు ఆ పదవి అంటే అంతలా ఎందుకు భయపడుతున్నారు, ఆ కుర్చీ వెనకాల ఎవరు ఉన్నారు అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News