అభద్రతా భావంతోనే తప్పుడు ఆరోపణలు : ఎమ్మెల్యే యశస్వినీ

పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు

Update: 2024-09-23 14:45 GMT

దిశ,దేవరుప్పుల : పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు అవుతుందనే అభద్రతాభావానికి గురవుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి తెలిపారు. సోమవారం మండల పార్టీ కార్యాలయంలో నల్ల శ్రీరాములు అధ్యక్షతన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ దేవరుప్పుల మండలం చిన్నమడూరు గ్రామంలో గల 80 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల లావాదేవీలలో వ్యాపారులకు మధ్య గొడవలు జరుగుతుంటే ఎలాంటి సంబంధం లేని కాంగ్రెస్ పార్టీ పై నాయకులపై ఆరోపణలు చేయడం మాజీ మంత్రి ఎర్రబెల్లి, బీఆర్ఎస్ పార్టీ నాయకుల విజ్ఞతకే వదిలి వేస్తున్నామని అన్నారు.

పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, పాలకుర్తి నియోజకవర్గం ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో మేము అన్ని వదులుకొని వచ్చాం.పాలకుర్తి ప్రజల కోసం,అభివృద్ధి కోసం అమెరికాలో వేల కోట్ల ఆస్తులను వదిలి సప్త సముద్రాలు దాటి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గంలో ప్రజల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసమని, సంపాదన కోసం కాదు ప్రజలకు సేవ చేసేందుకే వచ్చాం అని, ఎర్రబెల్లి లాగ దోచుకొని దాచుకోవడానికి రాలేదని అన్నారు. రుజువులేని నిరాధారమైన ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని, నియోజక వర్గ ప్రజలు ఉరికించి తరిమేస్తరని హెచ్చరించారు.

బీఆర్ఎస్ పార్టీ నాయకుల భరతం పడతాం : ఝాన్సీ రెడ్డి

పాలకుర్తి నియోజకవర్గంతో పాటు ఉమ్మడి జిల్లాలో భూదందాలకు ఆక్రమణకు పాల్పడింది మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్పడ్డాడు, ఇప్పుడు పాలకుర్తి నియోజకవర్గంలో నీతులు పలుకుతున్నారాని.కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు సహకరించాలి తప్ప దిగజారుడు, నిరాధారణమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదని, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు చావు దెబ్బ కొట్టిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి మార్పు రాలేదనీ పాలకుర్తి నియోజకవర్గం ఇన్చార్జి ఝాన్సీ రెడ్డి అన్నారు.మా కుటుంబాన్ని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అనేక ఇబ్బందులకు గురి చేసి, పౌరసత్వాన్ని రాకుండా అడ్డుకున్న చరిత్ర ఎర్రబెల్లి దయాకరరావుది అని, పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించి ప్రజలకు సేవ చేసేందుకే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నమని తెలిపారు. ఎర్రబెల్లి కుట్రలను, జిమ్మిక్కులను పాలకుర్తి నియోజకవర్గం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరనీ, ఇక నీ దుకాణం నియోజక వర్గంలో బంద్, ఎప్పటికప్పుడు నీ పగటి వేషాలను తిప్పికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మరవకు..ఎర్రబెల్లి తస్మాత్ జాగ్రత్త అని తెలిపారు.ఈ సమావేశంలో మండల సమావేశంలో మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.


Similar News