అర్హులకే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ: కలెక్టర్ భవేష్ మిశ్రా

Update: 2022-02-10 13:05 GMT

దిశ, మల్హర్: ఓసి ప్రాజెక్టు బ్లాక్-1లో ముప్పుకు గురైన అర్హులకే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తిస్తుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. గురువారం మండలంలోని తాడిచర్ల లో బొగ్గు నిక్షేపాలు వెలికి తీస్తున్న 500 మీటర్ల డేంజర్ జోన్ లోని ఇండ్లను పరిశీలించారు. అనంతరం నిర్వాసితులతో ఆయన మాట్లాడుతూ.. జెన్కో అధికారులు భూ సేకరణ చేసిన తర్వాత ఇల్లు నిర్మాణం చేపడితే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తించదని 2011 జనాభా సర్వే ప్రకారం, గుర్తించబడ్డ స్థానికులుగా 2013 చట్టప్రకారం కాపురంలో ఎస్టీలు, తాడిచర్ల లోని ఎస్సీలకు న్యాయం చేస్తానని.. స్థానిక నిర్వాసితులకు మాత్రమే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

జెన్కో, రెవెన్యూ అధికారులు గుర్తించిన భూ నిర్వాసితుల లిస్టులో కొందరి పేర్లు గల్లంతయ్యాయని.. తమకు న్యాయం చేయాలని కొంతమంది కలెక్టర్ను వేడుకున్నారు. దీనిపై స్పందించిన కలెక్టర్ 2010 సోషల్ ఎకనామిక్ జాయింట్ సర్వేలో గుర్తించబడ్డ లబ్ధిదారుల పిడిఎఫ్ జాబితా ప్రకారం అర్హులైన నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం వర్తిస్తుందని ఆయన తెలియజేశారు. నిర్వాసితులు అందరూ సహకరిస్తే త్వరితగతిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పనులు చేపట్టి మూడు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. 12 .08 ఎకరాల భూమిలో నిర్వాసితులకు రెండు గుంటల చొప్పున స్థలంతో పాటు ఒక మోడల్ కాలనీగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. బొగ్గు బ్లాస్టింగ్ వల్ల డేంజర్ జోన్‌లో ఉన్న ఇళ్లకు, పగుళ్లు తేలి దుమ్ము పొగలతో వివిధ రకాల జబ్బులకు గురవుతున్నారని కొన్ని ఇండ్లు సైతం కూలిపోయాయని కలెక్టర్ దృష్టికి నిర్వాసితులు తీసుకొచ్చారు. ఎన్విరాన్మెంట్ చట్టం ప్రకారం ఎమ్మార్ కంపెనీ వాళ్ళు నిర్వహిస్తున్న బ్లాస్టింగ్ వల్ల ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా చూసుకోవాలని వారం రోజుల్లో నిర్వాసితులకు, ఎమ్మార్ కంపెనీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.

బొగ్గు బ్లాస్టింగ్ వల్ల పొగ, దుమ్ము లాంటి ఫోటోలు వీడియోలతో హాజరు కావాలని జెన్కో ఎస్ఈ ని ఆదేశించారు. డేంజర్ జోన్ లో ఉన్న ఇండ్ల సమస్యలను మూడు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే సీఎస్‌ఆర్ 2013 చట్టం ప్రకారం గ్రామాల అభివృద్ధికి ఎమ్‌ఆర్ కంపెనీ సంవత్సరం టర్నోవర్‌లో 3శాతం నిధులు ఖర్చు పెట్టాలని జెన్కోఎస్‌ఈ ని సూచించారు. మానేరు ఇసుక సరిహద్దులను గుర్తించేందుకు మైనింగ్ ఏడీ ల ఆధ్వర్యంలో స్వయంగా పాల్గొని సర్వే చేయించి వారం రోజులో పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలా హద్దులను గుర్తించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తాడిచర్ల నుంచి భూపాలపల్లికి రోడ్డు మార్గాన్ని పరిశీలించి ఫారెస్ట్‌లో రోడ్డు నిర్మాణానికి అనుమతుల కోసం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, జెన్కో ఎస్ఈ తిరుపతయ్య ,ఈఈ తాపిల్ మహమ్మద్, ఏడిఈ వెంకటేశ్వర్లు, పిఆర్డిఈ శేషగిరి రావు, ఎంపీపీ చింతలపల్లి మల్హర్ రావు తాసిల్దార్ శ్రీనివాస్ ఎంపీడీవో నరసింహ మూర్తి తో పాటు భూ నిర్వాసితుల కమిటీ చైర్మన్ దండు రమేష్, నిర్వాసితులు పాల్గొన్నారు.

Tags:    

Similar News