న్యాయం ఉంటే నాకే ఓటెయ్యాలే.. డీఎస్ రెడ్యానాయక్
న్యాయం ఉంటే నాకే ఓటెయ్యాలే అని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు.
దిశ, నర్సింహులపేట : న్యాయం ఉంటే నాకే ఓటెయ్యాలే అని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నర్సింహులపేట మండలంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి ప్రచారం నిర్వహించారు. గ్యామ తండాలో మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి భూక్య సంగీతను ఉద్దేశించి మాట్లాడుతూ నాజేబు నుండి 40 లక్షల రూపాయలతో మొదటి సారి జడ్పీటీసీగా గెలిపించినట్లు తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మైదం దేవేందర్, దేవస్థానం చైర్మన్ బొల్లం రమేష్, వివిధ గ్రామాల సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామశాఖ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.