వీగిపోయిన అవిశ్వాసం…చౌటపల్లి పిఎసిఎస్ లో అనూహ్య పరిణామం
పర్వతగిరి మండలం చౌటపల్లి పిఎసిఎస్ చైర్మన్ గొర్రె దేవేందర్, వైస్ చైర్మన్ మధుసూదన్ రావు లపై పదిమంది డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం కోసం డీసీవో కు ఫిర్యాదు చేశారు.
దిశ, పర్వతగిరి: పర్వతగిరి మండలం చౌటపల్లి పిఎసిఎస్ చైర్మన్ గొర్రె దేవేందర్, వైస్ చైర్మన్ మధుసూదన్ రావు లపై పదిమంది డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం కోసం డీసీవో కు ఫిర్యాదు చేశారు. గత ఖరీఫ్, రబీ సీజన్లో వరి ధాన్యం కొనుగోలులో జరిగిన లావాదేవీల విషయంలో, పిఏసిఎస్ భవన నిర్మాణం ప్రహరీ గోడ నిర్మాణం, గోదాముల నిర్మాణాలు, రైతులకు ఇచ్చే రుణాల విషయంలో ఒక్కొక్క రైతు వద్ద మూడు వేల నుంచి ఐదు వేల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. ఇటీవల పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) నూతన కార్యాలయం ప్రారంభోత్సవ సందర్భంగా ఎక్కువ నిధులు ఖర్చు చూపారని, పాలకవర్గానికి తెలియకుండా సొంతంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ.. పాలకవర్గాన్ని నిర్వీర్యం చేస్తూ పెద్ద మొత్తంలో నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
అక్రమాలు జరిగాయని, వాటిపై సరైన లెక్కలు చూపించకపోవడంతో పది మంది డైరెక్టర్లు.. చైర్మన్ వైస్ ఛైర్మన్ లపై అవిశ్వాస తీర్మానం పెట్టగా అవిశ్వాస తీర్మానం పెట్టిన పది మంది డైరెక్టర్లలో ఏడుగురు డైరెక్టర్లు మాత్రమే హాజరు కాగా ప్రాథమిక సహకార చట్టం 1964 ప్రకారం మెజారిటీ సభ్యులు వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం నియమ నిబంధనలకు అనుగుణంగా అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని డిసిఓ తెలిపారు. చైర్మన్ వైస్ చైర్మన్ లపై చేసిన ఆరోపణలకు ఎంక్వైరీ కమిటీ వేశామని త్వరలో విచారణ జరిపిస్తామని, ప్రస్తుత నివేదికను జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీఐ రాజగోపాల్, ఎస్సై ప్రవీణ్ ,నోడల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, పిఎసిఎస్ సీఈవో, సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు.