కందికొండ గుట్టను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దండి
కందికొండ గుట్టను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దాలని రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డిని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ మాలోత్ నెహ్రు నాయక్ కోరారు.
దిశ, మరిపెడ : కందికొండ గుట్టను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దాలని రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డిని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ మాలోత్ నెహ్రు నాయక్ కోరారు. పటేల్ రమేష్ రెడ్డి మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ, కురవి మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మరిపెడ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద నెహ్రు నాయక్ స్వాగతం పలికారు. అనంతరం కురవి మండలంలోని కందికొండ గ్రామంలోని గుట్టపై కొలువై ఉన్న లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా కందికొండ గుట్టను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దాలి నెహ్రు నాయక్ రిక్వెస్ట్ చేయగా పటేల్ రమేష్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తి సహకరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి కురవి వీరభద్ర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.