భూపాలపల్లిలో కాంగ్రెస్ ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష..

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసినందుకు నిరసనగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షను కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రారంభించారు.

Update: 2023-03-27 09:23 GMT

దిశ, కాటారం, (భూపాలపల్లి): కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసినందుకు నిరసనగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షను కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రారంభించారు. ఉదయం ప్రారంభమైన ఈ దీక్ష సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది. ఈ దీక్షలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టారు.

పార్లమెంటులో రాహుల్ గాంధీని ఎదుర్కొనలేకనే అతనిపై పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు వేటు వేశారని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా విమర్శించారు. ఈ దీక్షలో డీసీసీ ప్రెసిడెంట్ అయిత ప్రకాష్ రెడ్డి, టీపీసీసీ సభ్యులు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గండ్ర సత్యనారాయణ రావు, వరంగల్ పార్లమెంట్ ఇంచార్జి దొమ్మాటి సాంబయ్య, కాంగ్రెస్ కౌన్సిలర్ గాట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News