అక్టోబర్-3నుండి భద్రకాళి నవరాత్రి ఉత్సవాలు.. వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

Update: 2024-09-27 15:46 GMT

దిశ, వరంగల్ : వరంగల్ మహానగరంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానంలో అత్యంత వైభవోపేతంగా జరపబడే శరన్నవరాత్రి మహోత్సవాల వాల్ పోస్టర్ ఆవిష్కరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

అక్టోబర్ 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు భద్రకాళీ దేవస్థానంలో అత్యంత వైభవోపేతంగా నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. అయితే ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తూ.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో నవరాత్రి ఉత్సవాల వాల్ పోస్టర్ ఆవిష్కరింపజేశారు ఆలయ ఈఓ శేషు భారతి, ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు.

తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా వాడవాడలా నిర్వహింపబడిన గణపతి నవరాత్రుల మహోత్సవాల్లో.. ఉత్సవ మండపాలు అన్నిటికి ఉచితంగా విద్యుత్ సరఫరా చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేంనరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


Similar News