రేపు ప‌ర‌కాల‌కు సీఎం కేసీఆర్‌.. వారిని ప‌రామ‌ర్శించేందుకు ఆక‌స్మిక ప‌ర్యట‌న

Update: 2022-01-17 12:23 GMT

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: అకాల వ‌ర్షానికి పంట‌లు న‌ష్టపోయిన రైతాంగాన్ని ప‌రామ‌ర్శించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 18న ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్యటించ‌నున్నారు. ఈ మేరకు ఇదే విష‌యాన్ని జిల్లా టీఆర్‌ఎస్ నేత‌లు ధ్రువీక‌రిస్తున్నారు. ఇటీవ‌ల కురిసిన అకాల వ‌ర్షాల‌తో పంట‌లు న‌ష్టపోయిన రైతుల‌ను ప‌రామ‌ర్శించేందుకు ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలో ప‌ర్యటించాల‌ని మంత్రి దయాక‌ర్‌రావు ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి విన్నవించారు. ఈమేర‌కు సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి మంగ‌ళ‌వారం ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గంలోని పరకాల, నడికూడ మండ‌లాల్లో ప‌ర్యటించ‌నున్నట్లు జిల్లా నేత‌ల‌కు స‌మాచారం అందించిన‌ట్లుగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి ఆక‌స్మిక ప‌ర్యట‌న ఖ‌రారు కావ‌డంతో అధికారులు ఏర్పాట్లలో నిమ‌గ్నమ‌య్యారు. సీఎంవో కార్యాల‌య అధికారులు అధికారిక ప్రక‌ట‌న చేయాల్సి ఉంది.

న‌ర్సంపేట నియోజ‌క‌వ‌ర్గంలోని న‌ర్సంపేట‌, దుగ్గొండి మండ‌లాల్లో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ప‌ర్యటించ‌నున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శన్‌రెడ్డి ఒక ప్రక‌ట‌న‌లో పేర్కొన్నారు.

Tags:    

Similar News