జనగామ కాంగ్రెస్‌లో రగులుకుంటున్న వర్గ పోరు..పోటాపోటీగా మాటల తూటాలు

జనగామ పేరు గత ఎన్నికల నుండి రాష్ట్రంలో హాట్ టాపిక్ గా

Update: 2024-09-24 10:33 GMT

దిశ,జనగామ: జనగామ పేరు గత ఎన్నికల నుండి రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. అసలు జనగామలో ఏం జరుగుతుంది.. ఒక గూటి పక్షులు ఇరు వర్గాలు గా మారి డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వర్సెస్ సీనియర్ నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండుతోంది. కొమ్మూరి నన్ను హత్య చేయించేందుకు సుపారీ ఇచ్చాడని కంచె రాములు చేసిన ఫిర్యాదుతో జిల్లాలో పార్టీ అడ్డంగా చీలిపోయే పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు అంతా కలిసే ఉన్న నాయకత్వం.. లోక్ సభ ఎన్నికలు వచ్చే సరికి రెండు వర్గాలుగా విడిపోయింది. ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో తన ఓటమికి కారణమయ్యారంటూ కొంతమంది నాయకులపై ప్రతాప్ రెడ్డి మనసులో పెట్టుకొని ప్రతిరోజు అదే మాటను బహిరంగంగానే విమర్శలు గుప్పించడంతో ఇరువురి మధ్య దూరం పెరిగింది. కొమ్మూరి నిర్లక్ష్యం, ఒంటెద్దు పోకడలతోనే ఓడిపోయారే తప్ప.. నాయకులు, కార్యకర్తల తప్పు లేదని మరో వర్గం అంటుంది. ఇలా ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటూ అధిష్టానానికి ఫిర్యాదు ద్వారా తెలియజేశారు. ఎవరి వర్గం వారు మీటింగులు పెట్టి పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకోవడం గమనార్హం..

కొద్ది రోజులుగా డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తో పాటు మరో వర్గానికి చెందిన సీనియర్ నాయకులు వేమెళ్ల సత్యనారాయణరెడ్డి, ఎర్ర మల్ల సుధాకర్, కంచె రాములు వర్గీయులు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, సీఎం వద్దకు వెళ్లి జనగామ నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులపై ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని వేర్వేరుగా నిర్వహిస్తూ గ్రూపులకు ఆజ్యం పోస్తున్నాయి. దీంతో దిగువ శ్రేణి నాయకత్వం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.

రెండు వర్గాలుగా విడిపోయి..డీసీసీ అధ్యక్షుడి ఫోటో లేని ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ.. చించి వేసుకునే స్థాయికి దిగజారి పోతున్నారు. ప్రతిపక్షంలో పదేళ్లు ఉండి పార్టీని కాపాడుకుంటే.. కొమ్మూరి బాధ్యతలు తీసుకున్న తర్వాత సీనియర్లను పక్కన పెడుతున్నారన్న వాదన వినిపిస్తోంది. ఇప్పుడు రచ్చంతా పదవులు ఆశిస్తున్నరనే వారిపైనే ఏదో ఒకటి చేసే తనకు నమ్మకమైన వ్యక్తులకు ఇవ్వడానికి డీసీసీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని పాత వారు కొన్ని ఏళ్లుగా పార్టీని నమ్ముకుని ఉంటే పోకూడదు ఆగం చేస్తున్నాడని వాపోతున్నారు. అసలు ఇది ఎటు దారి తీస్తుందో వేచి చూడాలి..


Similar News