సరదాగా బడికి వెళ్లిన చిన్నారి.. పాముకాటుకు బలి

తెలంగాణ రాష్టంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని,మన ఊరు మన బడి పథకం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారు.కానీ ఇక్కడ అభివృద్ధి కనబడటం లేదు.

Update: 2023-02-09 12:14 GMT

దిశ, పర్వతగిరి: తెలంగాణ రాష్టంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని,మన ఊరు మన బడి పథకం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారు.కానీ ఇక్కడ అభివృద్ధి కనబడటం లేదు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింతనెక్కొండ గ్రామ పంచాయతీ లో ఉన్న బట్టు తండాకు చెందిన మాన్విత(6) చిన్నారి ప్రైమరీ స్కూల్ చదువుకుంటుంది.రోజు లాగానే బడికి వచ్చి టాయిలెట్‌ కోసం వెళ్లిన చిన్నారి పాముకాటుతో ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి మృతి ఘటనపై బీఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై మండిపడ్డారు.

వివరాల్లోకి వెళితే.. తండాకుచెందిన భట్టు మోహన్, పార్వతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వారిలో పెద్ద కూమార్తె భట్టు మన్విత (6) తండాలోని ప్రైమరీ స్కూల్‌లో ఒకటో తరగతి చదువుతోంది.గురువారం రోజున మన్వితకు చెవులు కుట్టే కార్యక్రమం నిర్వహించాలని తల్లిదండ్రులు భావించారు. కార్యక్రమానికి రావాల్సిందిగా.. చుట్టూలను సైతం తల్లితండ్రులు ఆహ్వానించారు.వేడుకకు వచ్చిన బంధువులతో ఇళ్లంతా సందడిగా నిండిపోయింది. ఈ క్రమంలో తెల్లవారితే నాకు చెవులు కుట్టిస్తున్నారని తన స్నేహితులకు చేప్పుకుంటూ మన్విత ఎంతో ఉత్సాహంగా స్కూల్‌కు వెళ్లింది. తనకు చెవులు కుట్టిస్తున్నారంటూ మురిసిపోతూ స్నేహితులకు చెప్పింది. అనంతరం టాయిలెట్‌కు వెళ్లివస్తానని స్కూల్‌లో టీచర్ పర్మిషన్ తీసుకొని బాత్‌రూంకు వెళ్లింది. స్కూల్ మెట్లు దిగుతున్న క్రమంలో చిన్నారిని పాము కాటేసింది. వెంటనే స్కూల్ టీచర్ విషయాన్ని మన్విత తల్లితండ్రులకు తెలియజేశారు.ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పరుగుపరుగున పాఠశాలకు వచ్చి చిన్నారిని నర్సంపేట హాస్పిటల్‌కు తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచింది. తనకు చెవులు కుట్టిస్తున్నారని ఎంతో మురిసిపోయిన తమ కూతురు ఇలా విగతజీవిగా మారటంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వారి రోదనలు స్థానికులను కులిచివేశాయి.

ఈ పాపం ఎవరిది

చిన్నారి మృతి ఘటనపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాపం ఎవరిదంటూ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వం.. పాఠశాలలను బాగు చేస్తే పాములు ఎందుకు వస్తాయని నిలదీశారు. 'మన ఊరు- మన బడి పథకం పేరిట కోట్ల రూపాయలు మెఘా-ర్పణం చేసి, పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని గొప్పలు చెప్పుకున్న బీఆర్ఎస్ పార్టీ, ఈ పాపం ఎవరిది ? వందల కోట్లు ఏ పంది కొక్కులు బుక్కినయ్ ? ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను నిర్వీర్యం చేయడమేనా మీ లక్ష్యం?' అని ట్విట్టర్‌లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.

బడి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలి

చిన్నారిని పాముకాటు వేయడానికి కారణం బడి చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడం వలన చిన్నారి చనిపోయింది.మన ఊరు మన బడి పథకం ప్రవేశ పెట్టి కొన్ని నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయకపోవడం విడ్డూరం.ఏమైనా ప్రధాన స్కూళ్లకు మాత్రమే రంగులు వేస్తూ బీఆరెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది.ఇప్పటికైనా సంబంధించిన అధికారులు వెంటనే బడి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి మిగతా పిల్లలకు రక్షణ కల్పించాలి.

జాటోత్ శ్రీనివాస్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు

టీచర్ పై చర్యలు తీసుకుంటాం

బట్టుతండాలో చిన్నారి పాముకాటుకు గురై మరణించిన కారణముగా స్కూల్ టీచర్ బి.నవీన్ కుమార్ ను పై అధికారులతో చర్చించి తప్పక చర్యలు తీసుకుంటాము.చిన్నారికి పాము కాటు వేసినప్పుడు వెంటనే 108 కు కాల్ చేసి రప్పించాలిన అవసరం ఉంది అని,తల్లితండ్రులు ముడనమ్మకాలతో చిన్నారి మరణించింది.అదేవిధంగా డీఈవో, ఎంఆర్ఓ మేము స్కూల్ కు వెళ్లి అన్ని వసతులని పరిగనలోనోకి తీసుకున్నాము.

ఎంఈఓ చదువుల సత్యనారాయణ

Tags:    

Similar News