నెక్కొండలో గడప గడపకు కాంగ్రెస్
వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని నందమూరి నగర్ కాలనీలో టౌన్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
దిశ, నెక్కొండ : వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని నందమూరి నగర్ కాలనీలో టౌన్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టౌన్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమం కోసమే పాటుపడుతుందని అన్నారు.
అమలుకు సాధ్యమయ్యే పథకాలనే ప్రవేశపెడుతుందని, ప్రజలను మభ్యపెట్టే హామీలు ఇవ్వదని అన్నారు. చేతి గుర్తుకు ఓటు వేసి నర్సంపేట ఎమ్మెల్యే అభ్యర్థి దొంతి మాధవరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయికృష్ణ, చెన్నకేశవులు, సుబ్బారెడ్డి, సుధాకర్ రెడ్డి, వార్డ్ మెంబర్లు దిలీప్, శిరీష రాము, జిల్లా యూత్ అధ్యక్షుడు శివ కుమార్, మండల అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.