మాజీ సర్పంచ్ దారుణ హత్య.. హుటాహుటిన ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు

మాజీ సర్పంచ్ హత్యకు గురైన ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం చోటు చేసుకుంది.

Update: 2024-07-08 04:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: మాజీ సర్పంచ్ హత్యకు గురైన ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం చోటు చేసుకుంది. రాయపర్తి మండలం బురహాన్‌పల్లి గ్రామ మాజీ సర్పంచ్ సూధుల దేవేందర్‌ను తాజాగా గుర్తు తెలియని వ్యక్తులేవరో దారుణంగా హత్య చేశారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా దేవందర్ ఇంట్లో ఉన్న క్రమంలోనే హత్య చేశారని పలువురు అంటున్నారు. కాగా భూ తగాదాల విషయంలో సూధుల దేవేందర్‌ను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News