వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ దే విజయం: మంత్రి ఎర్రబెల్లి

సీఎం కేసీఆర్ సారథ్యంలో వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీయే విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

Update: 2023-04-23 12:11 GMT

దిశ, రాయపర్తి: సీఎం కేసీఆర్ సారథ్యంలో వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీయే విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆదివారం మండలంలోని కొత్తూరు ఏకే తండా, సూర్య తండా, బంధన్ పల్లి, కొలనుపల్లి, కొండూరు గ్రామాల కార్యకర్తలు ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయన సతీమణి ఉషా దయాకర్ రావు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరికి కార్యకర్తలు ఘన స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమ కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతున్నారని అన్నారు. ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త సైనికుడిలా పని చేసి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఆ ఫలాలు అందరికీ అందే విధంగా కృషి చేయాలని సూచించారు.

రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా రైతులకు ఉచిత కరెంట్, రైతుబీమా, రైతుబంధు తదితర పథకాలతో పాటు కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా పంటలకు సాగునీరు, మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు తాగునీరు అందిస్తున్న ఘనత మన ప్రభుత్వానికి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జీనుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మూణావత్ నరసింహ నాయక్, జిల్లా నాయకులు బిల్లా సుధీర్ రెడ్డి, ఆకుల సురేందర్రావు, కార్యదర్శి పూస మధు, మండల కో ఆప్షన్ ఆశరఫ్, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News