'బీఆర్ఎస్ మేనిఫెస్టో అద్భుతం'
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మేమే అని చెప్పుకుంటున్న కాంగ్రెసోళ్లు.. బ్రిటిష్ వాళ్ల విముక్తితో దేశానికి ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాట ఫలితంగా వచ్చిన స్వాతంత్రం.. ఇచ్చింది బ్రిటిష్ వాళ్లే అనుకోవాలా..? సమాధానం చెప్పాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు.
దిశ, తొర్రూరు/పాలకుర్తి : తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మేమే అని చెప్పుకుంటున్న కాంగ్రెసోళ్లు.. బ్రిటిష్ వాళ్ల విముక్తితో దేశానికి ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాట ఫలితంగా వచ్చిన స్వాతంత్రం.. ఇచ్చింది బ్రిటిష్ వాళ్లే అనుకోవాలా..? సమాధానం చెప్పాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. శనివారం పెద్దవంగర మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన ముఖ్య నాయకులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి మాట్లాడారు. నిరుపేదల సంక్షేమ అభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టో ఓ అద్భుతమని.. దాంతో ప్రతిపక్షాల్లో వణుకు పడుతోందని.. ఉద్యమ నేతగా నిరుపేదల కష్టాలు తెలిసిన కేసీఆర్ మేనిఫెస్టోతో పాటు మరెన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని అన్నారు.
రాష్ట్రంలో ప్రతి సామాజిక వర్గానికి ఎలాంటి ఇబ్బందులు వాటిల్లకుండా, ఎన్నో విధాల పథకాలను అందించారన్నారు. సీఎం కేసీఆర్ నిరుపేదలకు అందించిన పథకాలే.. మూడోసారి కేసీఆర్ కు పట్టం కట్టడం ఖాయమన్నారు. 60 ఏళ్లు పాలించి ఆగం చేసి కొత్తగా ఏదో చేస్తామంటే ఎట్లా. తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మరని హక్కుల కోసం ఉద్యమాలు చేసిన ప్రజలనీ పేర్కొన్నారు. కరోనాతో రాష్ట్రంలో కొంత అభివృద్ధి ఆలస్యం అవుతుందని, రైతులకు సైతం రుణమాఫీ కొంత ఆలస్యమైందని, ఏ ఒక్క రైతుకు రుణమాఫీ ఆగదు అన్నారు. ఉమ్మడి జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాల గెలుపు ఖాయం.. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలు బిఆర్ఎస్ పార్టీ వేనని, గెలుపు ఖాయమని, అధిక మెజార్టీ లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందన్నారు. 12 అసెంబ్లీ స్థానాలను అధిక మెజార్టీతో గెలిపించి. సీఎం కేసీఆర్ కు అందిస్తామన్నారు. పాలకుర్తి నియోజకవర్గం లో ఎవరు వచ్చినా పోటికి సిద్ధమని ప్రజలకు దయన్నపై అభిమానం ఉందని, పాలకుర్తి ప్రజలకు కష్టకాలంలో అండగా నిలిచానని. అదే రీతిలో కష్టకాలంలో జరిగిన అన్ని ఎన్నికల్లో ప్రజలు ఆదరించి ఎన్నికల్లో గెలిపించి ఆదుకున్నారని గుర్తు చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఎన్నికల్లో జరిగే పోటీకి రావాలంటే. ప్రతిపక్షాల్లో వణుకు పుట్టి భయం పట్టుకుందన్నారు.
ఎవరు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమన్నారు. ఓటు అడిగే హక్కు, దమ్ము, ధైర్యం తమకే ఉందన్నారు. ఎన్నికల సమయంలో వచ్చే టూరిస్టుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని పెద్దవంగర, తొర్రూర్, పాలకుర్తి మండలాలకు చెందిన కొరిపల్లి, ఉప్పరగూడెం, ఇరవెన్ను, గోపాలగిరి గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు చర్లపాలెం,గోపాలగిరి గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన 1వ వార్డు సభ్యులు కర్ర మౌనిక - ప్రశాంత్ రెడ్డి, కర్ర శ్రీకాంత్ రెడ్డి, గోపాలగిరి గ్రామ మాజీ ఉప సర్పంచ్ ధర్మారపు ఉప్పలయ్య, ధర్మారపు నర్సయ్య, ఎనమాల అనిల్, ధర్మారపు మధు, ఈరవెన్ను గ్రామ కాంగ్రెస్ పార్టీకి చెందిన బొట్టు రఘుపతి, శకిలం ప్రభాకర్, కొడిశాల వనేష్, జానీ, రాజు, బండి రాజు, కోడి శంకర్, కొడి శాల సోమయ్య, పెద్దవంగర మండలం కొరిపల్లి, ఉప్పరగూడెం గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు బొటుమంచి ఆనంద్, ఉట్ల నర్సిరెడ్డి, పెద్ది కొమురయ్య, పెద్ది వెంకటయ్య, అనిల్, పాశం యాకయ్య, వెంకటేశం, ఎండీ రహీమ్ బిఅర్ఎస్ పార్టీలో చేరగా వారికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.