Current Shock : సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్.. బాలుడి మృతి
వరంగల్(Warangal) జిల్లాలో సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్(Current Shock) కొట్టి బాలుడు మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది.
దిశ, వెబ్ డెస్క్ : వరంగల్(Warangal) జిల్లాలో సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్(Current Shock) కొట్టి బాలుడు మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నారావుపేట మండలం జల్లి గ్రామానికి చెందిన సంపంగి రాకేష్ స్థానికంగా ఉన్న గవర్నమెంట్ హైస్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అయితే శనివారం ఉదయం తన సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెట్టేందుకు ప్రయత్నించే సమయంలో కరెంట్ షాక్‌కు గురయ్యి రాకేశ్ అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో బాలుడి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.