గంజాయి మత్తులో యువకుడు వీరంగం..?

మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ లో ఓ యువకుడు గంజాయి మత్తులో వీరంగం సృష్టించినట్లు సమాచారం.

Update: 2024-12-14 14:34 GMT

దిశ,నెక్కొండ: మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ లో ఓ యువకుడు గంజాయి మత్తులో వీరంగం సృష్టించినట్లు సమాచారం..స్టేషన్లోని బుకింగ్ కౌంటర్ లో ప్రయాణికుల వద్దకు వెళ్లి హల్చల్ చేయడంతో భయాందోళనలకు గురయ్యారు. రైల్వే స్టేషన్ సిబ్బంది ప్రయాణికులు యువకుడిని అదుపు చేసి పోలీసులకు అప్పగించారు. యువకుడి వద్ద సొల్యూషన్ లాంటి ఓ ట్యూబ్ ఉన్నట్లు సమాచారం. యువకుడు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు ఎస్సై తెలిపారు. తమిళనాడులో పని చేస్తున్నట్లు తెలిపాడు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎస్సై మహేందర్ యువకుడికి స్టేషన్ కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం యువకుడిని స్వస్థలానికి పంపించినట్లు తెలిపారు.


Similar News