అభివృద్ధి జరగాలంటే ఆశీర్వదించండి : పెద్ది సుదర్శన్ రెడ్డి
నర్సంపేట నియోజకవర్గంలో మరోసారి అభివృద్ధి జరగాలంటే
దిశ,నర్సంపేట: నర్సంపేట నియోజకవర్గంలో మరోసారి అభివృద్ధి జరగాలంటే ఆశీర్వదించాలని నర్సంపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి కోరారు. రానున్న ఎన్నికల ప్రచారంపై బీఆర్ఎస్ పట్టణ పార్టీ క్లస్టర్ భాద్యులు, ముఖ్యనాయకులతో సిటిజెన్స్ క్లబ్ నందు సమావేశం గురువారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి దిశానిర్దేశం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఇప్పటికే నర్సంపేట పట్టణ ప్రజలకు విద్య, వైద్య, జిల్లా హాస్పిటల్, మెడికల్ కళాశాల, కుల సంఘాల భవనాలు, అధునాతన మార్కెట్, ఆడిటోరియం, డియాగ్నోస్టిక్స్ హబ్, హెల్త్ సబ్ సెంటర్, 12 కిలోమీటర్ల డివైడర్, సెంటర్ లైటింగ్, జంక్షన్ల అభివృద్ధి లాంటి అనేక మౌలిక సదుపాయాలు కల్పించినట్లు పెద్ది తెలిపారు. నర్సంపేటలో అభివృద్ధి పై చర్చకు రమ్మంటే ప్రతిపక్ష నాయకులు పక్క నియోజకవర్గాలకు పారిపోయారని ఎద్దేవా చేశారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులకు నిధులు నర్సంపేటకు తీసుకువచ్చానని పెద్ది స్పష్టం చేశారు. నర్సంపేట నియోజవర్గ అభివృద్ధిని 10 సంవత్సరాలు అడ్డుకున్న నాయకులు మళ్లీ నాపై పోటీచేస్తున్నట్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పాత నాయకుల, రోత మాటలు, అబద్ధపు ప్రచారాలను ప్రజలు ఎన్నటికీ నమ్మరని ఆశాభావం వ్యక్తం చేశారు. విజన్, విలువలు లేని, స్థిరత్వం లేని నాయకులతో అభివృద్ధి జరగదన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే వాళ్లకు బుద్ధి చెబుతారన్నారు. నర్సంపేట లో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. సంక్షేమంపైన, అభివృద్ధి పైన ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ కే ఉందన్నారు. నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో అభివృద్ధి జరగాలంటే మళ్లీ ఆశీర్వదించాలని పెద్ది కోరారు.