మహిళల వయసుతో సంబంధం లేదు.. ప్రసూన లక్ష్మి

కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీలలో భాగంగా నేటి నుండి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించిందని నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మి తెలిపారు.

Update: 2023-12-09 12:20 GMT

దిశ, నర్సంపేట : కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీలలో భాగంగా నేటి నుండి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించిందని నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మి తెలిపారు.  బస్సులో ప్రయాణించడానికి మహిళలకు వయసుతో సంబంధం లేదని ఎవరైనా ప్రయాణించవచ్చని తెలిపారు. ఈ ఉచిత ఆర్టీసీ బస్సుసౌకర్యాన్ని డివిజన్లోని మహిళలందరూ ఉపయోగించుకోవాలని కోరారు. బస్సులో ప్రయాణించే ముందు తమవెంట ప్రతి మహిళ ఓటరు కార్డు గాని లేదా ఏదైనా గుర్తింపు కార్డు వెంట తీసుకురావాలని ఈ సందర్భంగా కోరారు. బస్సులో ప్రయాణించడానికి ఇచ్చే టికెట్లను కూడా త్వరలో ప్రింట్ చేస్తామని అన్నారు. ఈ ఉచిత బస్సు సౌకర్యం పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీస్లకు మాత్రమే వర్తిస్తుందని అన్నారు.

Tags:    

Similar News