high alert : ఏజెన్సీలో హై అలర్ట్
జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టు పార్టీ అగ్రనేతలు మావోయిస్టు సంస్మరణ వారోత్సవాలు నిర్వహించేందుకు పిలుపునిచ్చారు.
దిశ,ఏటూరునాగారం : జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టు పార్టీ అగ్రనేతలు మావోయిస్టు సంస్మరణ వారోత్సవాలు నిర్వహించేందుకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ములుగు జిల్లా ఏస్పీ శబరీష్ ఆదేశాల మేరకు ములుగు జిల్లా వ్యాప్తంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతలలో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహిస్తూ అడవులను జల్లెడ పడుతున్నారు. అంతే కాకుండా గుత్తికోయ గూడలలో నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ గుత్తికోయ వాసులతో మాట్లడుతూ వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. కాగా ఆదివారం ఏటూరునాగారం ఏస్సై తాజోద్దిన్ ఏటూరునాగారం మండల అడవీ ప్రాంతంలోని లింగపురం, గుత్తికోయ గూడాలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా ఎవరైనా
కనబడితే అదుపులోకి తీసుకుని విచారించి వదిలేస్తున్నారు. ఈ సందర్భంగా ఏస్సై తాజోద్దిన్ గుత్తికోయ వాసులతో మాట్లడుతూ అపరిచిత వ్యక్తులకు ఆశ్రయం కల్పించవద్దని, అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు తారాస పడితే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదని, చట్ట రీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అంతే కాకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో గూడాలలో గర్భనీ స్త్రీలు ఉన్నట్లయితే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రధాన కూడళ్ల వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ద్విచక్ర వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు, హెల్మెట్ కలిగి ఉండాలని వాహన దారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం రెండవ ఎస్సై రమేష్, సివిల్, సీఆర్‌పీఎఫ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.